వేసవికాలంలో నీళ్ల విషయంలోనే కాదు ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎన్నినీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇక ఆహారం విషయం చెప్పనక్కర్లేదు. ఈ కాలంలో నీళ్ల విషయంలోనే కాదు ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు అవసరమంటున్నారు పోషకాహార నిపుణులు.

దాహం వేసినపుడే నీళ్లు తాగుదాం అనే ఆలోచన వేసవిలో పనికి రాదు. దాహం వేసినా, వేయకపోయినా వీలైనంత ఎక్కువ నీటిని తాగేయాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఇది బాగా ఉపకరిస్తుంది. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకుంటే మరీ మంచిది.
తాజా పండ్లు, కూరగాయలు
వేసవికాలంలో పండ్లు తప్పకుండా ఉండాలి. రోజూ ఏవైనా రెండు రకాల పండ్లను తీసుకోవాలి. వాటర్‌మెలన్, పైనాపిల్, ఆపిల్, సపోటా, బత్తాయి వంటి పండ్లను తీసుకుంటే మంచిది. జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇష్టమైన వారు సలాడ్స్ తినొచ్చు. తాజా కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.


పెరుగు
భోజనంలో పెరుగు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వేసవి కాలంలో బట్టర్‌మిల్క్ తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇందులో పుదీనా కలుపుకుంటే మరీ మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సివచ్చినపుడు ఒక గ్లాసు బట్టర్‌మిల్క్ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది.
భోజనం మరవద్దు
స్థూలకాయంతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం భోజనం చేయడం మానేస్తుంటారు. భోజనం మానేయడం వల్ల శరీర జీవక్రియలు కుంటుపడతాయి. శరీరం తక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కాబట్టి భోజనం మానేయవద్దు. తక్కువ ఆహారాన్ని తీసుకున్నా సమయానికి తీసుకోవడం మరవద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేసవికాలం కూడా హాయిగా గడిచిపోతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top