పిల్లలు ఆహారం కాని వస్తువులను తింటున్నారా...?

పిల్లలు ఆహారంగా పరిగణించని బలపాలు, ప్లాస్టిక్ వంటి వాటిని నోటిలో పెట్టుకోవడం మామూలే. పద్దెనిమిది నెలల నుంచి రెండేళ్ల లోపు పిల్లలు ఇలా ఆహారం కాని పదార్థాలను రుచి చూడటం సాధారణమే. ఈ రుగ్మతను పైకా అంటారు. అయితే ఇలా ఆహారం కాని పదార్థాలను రుచిచూసే అందరికీ పైకా ఉందని చెప్పడం సాధ్యం కాదు. ఆ అలవాటుతో పాటు ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ అబ్‌నార్మాలిటీస్), పెరుగుదల లోపాలు (డెవలప్‌మెంటల్ డిలే) ఉన్న సందర్భాల్లో పిల్లలకు ఈ అలవాటు ఉంటే దాన్ని రుగ్మతగా పరిగణించాలి. సాధారణంగా ఈ సమస్య 10 నుంచి 20 శాతం మంది పిల్లల్లో ఏదో ఒక దశలో చూస్తుంటాం. పెద్దలలో ఈ రుగ్మత తక్కువ. కాని అప్పుడప్పుడూ పెద్దల్లోనూ కనిపిస్తుంటుంది.


ఈ రుగ్మత ఉన్నవాళ్లు తరచూ మట్టి, బియ్యంలో మట్టిగడ్డలు, ఇసుక, పిండి, పెన్సిల్ ఎరేజర్ ముక్కలు, పేపర్, పెయింట్ చిప్స్, బొగ్గు, చాక్‌పీసులు, వైర్ ముక్కలు, కాల్చేసిన అగ్గిపుల్లలు... ఇలా అనేక రకాల వస్తువులు నమలడం, తినడం చేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారనడానికి కారణాలు నిర్దిష్టంగా చెప్పడం కష్టం. అయితే కొన్ని అల్పాదాయవర్గాలలో, బలమైన అనుబంధాలు లేనందువల్ల కుటుంబపరమైన సమస్యలతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యే పిల్లల్లో ఈ తరహా రుగ్మతలు కనిపించడం ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని పరిశీలనల ప్రకారం...

- ఐరన్, క్యాల్షియం, జింక్, థయామిన్, విటమిన్-సి, విటమిన్-డి లోపాలు ఉన్నప్పుడు కొన్ని ఖనిజ లవణాల లోపాలు ఉన్నప్పుడు పిల్లలలో ఈ తరహా అలవాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రుగ్మత వల్ల అనేక సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. కొన్ని రకాలు ఇన్ఫెక్షన్లు రావడం, పొట్టలో పురుగులు రావడం (ఇన్‌ఫెస్టేషన్స్) వంటివి జరగవచ్చు. అలాగే వెంట్రుకలు, ప్లాస్టిక్ వస్తువులు తినేవారిలో అవి పేగుల్లో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. 



కొన్ని సందర్భాల్లో ఇలాంటి పిల్లల్లో విషపూరితమైన పదార్థాలు కడుపులోకి చేరడం వంటివి జరగవచ్చు. ఉదాహరణకు లెడ్ పాయిజనింగ్. ఇలాంటివి తినడం వల్ల పిల్లలకు రక్తహీనత, బలహీనంగా మారడం, ఫిట్స్, తలనొప్పి వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి పిల్లలకు రక్తహీనత సమస్య ఉందేమో తెలుసుకోవడం చాలా ప్రధానం.

ఇక చికిత్స విషయానికి వస్తే... వాళ్లకు పొట్టలో పురుగులు పోయేలా డీ-వార్మింగ్ మెడికేషన్ ఇవ్వడం అవసరం. దాంతోపాటు ఐరన్, ఇతర విటమిన్లు ఉండే పోషకాహారపు సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ అలవాటు క్రమంగా తగ్గిపోతే మున్ముందు ఎలాంటి చికిత్స అవసరం ఉండదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top