
హలాసనం
హలం అనగా నాగలి వలే శరీర స్థితి ఉంటుంది. కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఇది
సర్వాంగ ఆసనం తర్వాత ప్రశాంతంగా జాగ్రత్తగా వేయాల్సిన ఆసనం. సర్వాంగాసనం
స్థితిలో నిటారుగా నిలిచి ఉన్న కాళ్లను, నడుము దగ్గర వంచుతూ, తలను దాటించి,
నేలకు కాలి వేళ్లను తాకించాలి. చేతులు తిన్నగా నేల మీద చాచాలి. శ్వాస
సామాన్యంగా ఉండాలి. రెండు నిమిషాలు ఆ ఆసనం స్థిరంగా వేసిన తర్వాత
సర్వాంగాసనం వేస్తూ, అదే విధంగా కాళ్లను కిందికి తెచ్చి విశ్రాంతి
తీసుకోవాలి. ఇది పిల్లలు పుట్టని స్ర్తీలకు ప్రయోజనకారి. ఉదర వ్యాధులకు
బాగా పనిచేస్తుంది. వెన్నెముకకు మంచిది. పిరుదులకు, నడుముకి పుష్టి
కలిగిస్తుంది. అన్ని గ్రంథులకు చురుకుతనం లభిస్తుంది.లాభాలు
- శరీర కండరాలు వ్యాప్తించి, శరీరం ఫ్లెక్సిబల్‌గా తయారవుతుంది.
- ఉదర సమస్యలు తొలుగుతాయి.పురుషులలో రెక్టమ్, స్ర్తీలలో యుటెరస్ సమస్యలు తగ్గుతాయి.
- మెన్‌స్ట్రాల్(బహిస్టు) సమస్యలు తొలుగుతాయి.
- హెర్నియా రాకుండా నివారిస్తుంది.
గమనిక - బహిస్టు సమయంలో, మూడు నెలల గర్భవతులు ఈ ఆసనాన్ని చేయరాదు.
- హలాసనాన్ని ఖాలీ కడుపుతోనే చెయ్యాలి.
- నడుమును వీలయినంత వరకు నేలకు అనించి ఉంచాలి.