ఆరోగ్యానికి, అందానికి నిమ్మ

ఆరోగ్యానికి, అందానికి నిమ్మ బోలెడు సాయం చేస్తుంది. ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటే ఒక గ్లాసుడు వేడినీళ్లలో ఐదారు చుక్కలు నిమ్మరసం వేసుకుని తాగితే వెంటనే ఉపశమనం వస్తుంది. ఎండలో ప్రయాణం వల్ల చర్మం కందిపోయినా, టాన్ వల్ల చర్మం గట్టిగా అయినా నిమ్మచెక్కతో మసాజ్ చేయండి.

ఓ నాలుగైదుసార్లు చేస్తే చర్మంలో ఉన్న మురికి, మచ్చలు పోయి నిగారింపు వస్తుంది. పళ్ల మధ్య నుంచి రక్తం వచ్చినపుడు తాజా నిమ్మరసంలో దూది ముంచి పళ్లపై ఒత్తాలి. రోజూ పళ్లను నిమ్మరసంతో కడుక్కుంటే కూడా మంచిదే. నిమ్మరసం నీళ్లతో పుక్కిలి పట్టడం వల్ల గొంతుకకి కూడా మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top