వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఉండే ముఖ్య లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు.

ఎండలు ముదురుతున్నాయి. వడదెబ్బల సీజన్ మొదలవుతోంది. వేసవి కాలంలో పిల్లలు, వృద్ధుల ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఎండలోనే పనిచేయవలసిన కార్మికులు, మెడికల్ రెప్ లాంటి ఉద్యోగస్తులు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఉండే ముఖ్య లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు.

- విపరితంగా చెమట కారిన తర్వాత హఠాత్తుగా చెమట పట్టడం ఆగిపోతుంది.

- నీరసించిపోవడమే కాకుండా స్పృహ కూడా కోల్పోతారు.

- శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలకు కూడా చేరుతుంటుంది.

- శరీరం వెచ్చబడి పొడిగా మారిపోతుంది.

- ఒక్కోసారి శరీరం ఎర్రగా లేదా నీలంగా మారిపోతుంది.



- మెదడు మొద్దుబారుతుంది. ఊపిరి వేగం పెరుగుతుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది.

- శరీరం నుంచి విపరీతంగా చెమట వెలువడుతుంటే ఎక్కువసార్లు నీళ్లు తాగడంతోపాటు ఉప్పు కూడా తగినంత తీసుకోవాలి.

- ఎండలో తిరిగినపుడు నీరసం, తలతిరగడం, వికారం, తలనొప్పిలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే నీడ పట్టుకు చేరిపోవాలి.

- శరీరానికి అవసరమైన సోడియం అందడానికి, శరీరం చల్లబడడానికి మంచినీరు, ఎనర్జీ డ్రింకులను తీసుకోవాలి. కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్, పండ్ల రసాలను బాగా తీసుకోవాలి. సోడా, మద్యం, కాఫీలను సేవించకూడదు.

- పండ్లు తీసుకోవలసి వస్తే పుచ్చకాయ, కర్బూజ, ఆరెంజ్ లాంటి నీరు ఉండే పండ్లను తీసుకోవాలి.

- బయటకు వెళ్లినపుడు తేలికపాటి, వదులైన కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ఎండ నుంచి రక్షణ కోసం తలకు టోపీ, కళ్లకు సన్‌గ్లాసెస్ ధరించాలి.

- వేసవిలో వచ్చే మరో ప్రధాన ఆరోగ్య సమస్య కంటి చూపు దెబ్బతినడం. సూర్యకాంతిలోని అల్ట్రావైలట్ కిరణాలు కంటిని దెబ్బతీస్తాయి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌గ్లాసెస్ ధరించాలి.


- వేసవిలో నీటి ఎద్దడి కారణంగా కలుషిత నీటిని తాగి అతిసార వ్యాధికి గురి కావలసి వస్తుంది. ఈ విషయంలో ముఖ్యంగా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు పిల్లలకు కాచిన నీటిని ఇవ్వడం ఉత్తమం.

- వేడి కారణంగా పిల్లల లేత చర్మంపై పొక్కులు, చెమట కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ లోషన్ల్లు, ప్రిక్లీ హీట్ పౌడర్ వాడితే మంచిది. ముఖ్యమైన ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top