కళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి..

శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడానికి వ్యాయామాలు చేయడం ఎంత అవసరమో కళ్లను పరిరక్షించుకోవడానికి కొన్ని మంచి అలవాట్లు ఉండడం కూడా అంతే అవసరం. దృష్టిలోపం ఏర్పడకుండా, కళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి..

- రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోండి. రెండు కళ్లను మూసి వాటిపై చల్లటి నీళ్లను చల్లండి. కంట్లో, కనురెప్పలలో పేరుకున్న దుమ్ము తొలగిపోయి కళ్లు స్వచ్ఛంగా ఉంటాయి.

- రెండు కళ్లు మూసుకుని వాటిని అరచేతులతో పూర్తిగా కప్పి ఉంచండి. వెలుతురు అనేది కనపడకుండా కళ్లను కప్పి ఉంచండి. అలా రోజుకు ఐదు నిమిషాల చొప్పున రెండు మూడు సార్లు చేయాలి. దీని వల్ల కళ్లకు కొద్దిసేపు విశ్రాంతి లభించడమేకాకుండా ఒత్తిడి తగ్గుతుంది.


- రాత్రి గాఢంగా నిద్రపోవాలంటే నిద్రపోయే ముందు కాళ్లను చన్నీటితో కడుక్కోవాలి. బాత్‌రూమ్‌లోని పొడిగా ఉన్న నేలపైన అరికాళ్లను రెండు మూడు నిమిషాల పాటు రాయాలి. అనంతరం కాళ్లను చన్నీళ్లతో కడగాలి. తర్వాత అరికాళ్లకు ఆరునెయ్యి లేదా కాస్టర్ ఆయిల్‌తో కొద్దిసేపు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చక్కని నిద్ర పడుతుంది.

- వారానికోసారి కంటికి స్నానం చేయించాలి. కళ్లు మునగగల రెండు గిన్నెల్లో చన్నీళ్లను కాని కొద్దిగా ఉప్పు వేసిన నీళ్లను కాని తీసుకుని రెండు కళ్లను ఆ నీటిలో ముంచాలి. కళ్లను తెరుచుకుని అలా చేయడం వల్ల కళ్లలో ఏవైనా నలుసులు కాని సన్నటి రేణువులు కాని ఉంటే బయటపడతాయి. అలా ఒకటి రెండు నిమిషాలు చేస్తే కళ్లు పరిశుభ్రంగా ఉంటాయి.

- సూర్యోదయాన్ని ప్రతిరోజూ చూసే అలవాటు చేసుకుంటే సూర్యకిరణాలలోని విటమిన్లు కంటికి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.

- రాత్రుళ్లు చంద్రుడిని చూడడం వల్ల కూడా నేత్రాలకు మంచిది. మిద్దెమీద వెల్లకిలా పడుకుని ఓ ఐదు నిమిషాలు చంద్రుడిని చూస్తే కళ్లు, మనసు స్వచ్ఛంగా తయారవుతాయి.


- వారానికోసారి కళ్లకు ఉప్పునీటిలో ఆవిరిపట్టడం వల్ల కళ్లలో ఏవైనా హానికర నలుసులు, క్రిములు వంటివి ఉంటే తొలగిపోవడమే కాక కంటి వద్ద కండరాలు వదులై కంటికి మేలు చేస్తాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top