ఈ మధ్యకాలంలో మల్టీగ్రెయిన్ ప్రొడక్ట్స్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. వీటివల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా?

సాధారణ ఆహారంతో పోల్చితే మల్టీ గ్రెయిన్ ఫుడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకి గోధుమ పిండితో చపాతీ చేసుకునే కన్నా పెసర్లు, శనగలు,సోయాబీన్, గోధుమలు వంటి వివిధ రకాల ధాన్యాలున్న మల్టీగ్రెయిన్ పిండిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఫైబర్‌తో పాటు తగినంత ప్రొటీన్ లభిస్తుంది. ప్రతిరోజు రెండు రకాల గింజధాన్యాలను తీసుకోవాలి. కానీ చాలా మంది తీసుకోరు. మల్టీగ్రెయిన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ లోటు భర్తీ అవుతుంది. మల్టీగ్రెయిన్ అట్టానే కాకుండా మల్టీగ్రెయిన్ బిస్కట్స్, బ్రెడ్, నూడిల్స్, ఆల్ న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ ఇలా రకరకాలుగా మల్టీగ్రెయిన్ ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top