డాక్టర్ కావడానికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.ఇంజనీర్ కావడానికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.మరి రాజకీయాల్లో రాణించడానికి ఉన్నాయా?

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - బెంగళూరు (I-WIL (IIMB)) భాగస్వామ్యంతో ఒక స్వచ్ఛందసంస్థ ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్ షిప్ (ఐడబ్ల్యూఐఎల్) పేరుతో మూడు నెలల సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభించింది. మహిళలు రాజకీయ రంగంలో రాణించడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

డాక్టర్ కావడానికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.ఇంజనీర్ కావడానికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.రాజకీయాల్లో రాణించడానికి ఉన్నాయా?జవాబుకు ముందుగా ‘ఆశ్చర్యం’ ప్రత్యక్షమవుతుంది.‘‘అలాంటి కోచింగ్ సెంటర్‌లు కూడా ఉంటాయా?’’ అనే తిరుగు ప్రశ్న ఎదురవుతుంది. ఈ ప్రశ్నలు, ఆశ్చర్యాల సంగతి ఎలా ఉన్నా...మహిళలకు రాజకీయాల్లో శిక్షణ ఇచ్చి, బలమైన నాయకులుగా తయారుచేయడానికి బెంగళూరులోని ప్రసిద్ధ బిజినెస్ స్కూలు ఐఐయమ్ వేదిక కానుంది.

రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న నేపథ్యంలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచడానికి, బలమైన రాజకీయ నాయకులుగా తయారు చేయడానికి మహిళలల కోసం ప్రత్యేకించి సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించింది ది సెంటర్ ఫర్ సోషల్ రిసెర్చ్(సియస్‌ఆర్) అనే స్వచ్ఛందసంస్థ. ‘‘ఒక పని విజయవంతం చేయడానికి నైపుణ్యం ఉండాలి. విషయం మీద పట్టుండాలి. రాజకీయాలలో రాణించడానికి కూడా ఇదే సూత్రం పని చేస్తుంది. ఒక క్రమపద్ధతిలో పనిచేస్తూ పోతే రాజకీయాల్లో రాణించడం కష్టమేమీ కాదు’’ అంటున్నారు కోర్సు నిర్వాహకులు.
 

‘ఇండియన్ వుమెన్ ఇన్ లీడర్‌షిప్’ పేరుతో మొదలయ్యే మూడునెలల ప్రోగ్రాంలో వివిధ కోణాలలో పరిపాలనకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తారు. ‘‘మహిళలు ఎన్నికలలో పోటీ చేయడానికి అవసరమైన మానసికస్థైర్యాన్ని ఇవ్వడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది’’ అని సంస్థ ప్రతినిధులు చెప్పారు. తొలి బ్యాచ్ జూలై16న మొదలవుతుంది.

కనీస అర్హతలు:
వయను 25 లేదా ఆ పైన. క్రియాశీల రాజకీయాల మీద ఆసక్తి. డిగ్రీ చేసి ఉండాలి. విలువైన ఉపన్యాసాలు ఇప్పించడం, క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకువెళ్లడంతో పాటు ఢిల్లీ, సింగపూర్‌లకు స్టడీ టూర్స్‌కు తీసుకువెళతారు. కేస్ స్టడీ, కాన్‌స్టిట్యుయెన్సీ ప్రొఫైలింగ్, మోడల్ పార్లమెంట్, మీడియా ఇంటరాక్షన్‌లు ఉంటాయి. ‘ఆకట్టుకునేలా ప్రసంగించడం ఎలా?’ లాంటి విషయాలతో పాటు రాజకీయ ఎత్తుగడల గురించి కూడా వివరిస్తారు. ఫ్యాకల్టీలో పేరున్న మహిళా రాజకీయనాయకులు, జెండర్ ఎక్స్‌పర్ట్‌లు, విద్యావేత్తలు ఉన్నారు. ‘‘జెండర్ గ్యాప్ ఇండెక్స్ లెక్కల ప్రకారం భారత రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం బలహీనంగా ఉంది.
 


 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top