వంటగ్యాస్‌ను ఆదా చేయడానికి...కొన్ని చిట్కాలు

దుబారా, ఇతర అవసరాలకు వాడటం, కొరత తదితరాల మూలంగా గ్యాస్ బుక్ చేసిన తర్వాత రెండు మూడువారాలకు గానీ సిలిండర్ సరఫరా కావడం లేదు. దాంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబీకుల ఇక్కట్లు చెప్పనలవి కాదు. ఇక సింగిల్ సిలిండర్‌తో గడిపేవాళ్ల సంగతి సరేసరి! కొన్ని మెళకువ లను పాటించడం ద్వారా గ్యాస్ దుబారాను అరికట్టవచ్చు. అదెలాగో చూద్దాం.

వండటానికి కావలసిన సరంజామా అంతా సిద్ధం చేసుకుని, పాత్రను స్టవ్ మీదపెట్టిన తర్వాతనే స్టవ్ వెలిగించాలి.


వంటకు అవసరమైన మేరకు మాత్రమే నీటిని ఉపయోగించాలి. లేదంటే అవి మరగటానికి ఎక్కువ గ్యాస్ అవసరమవుతుంది!


పెద్దబర్నర్ కన్నా చిన్నబర్నర్‌ను వాడటం ద్వారా 15 శాతం గ్యాస్ ఆదా అవుతుంది.


వంటకు ప్రెజర్ కుకర్‌ను, ప్రెజర్ పాన్‌ను ఉపయోగించడం, పదార్థాలు ఉడికేటప్పుడు మూత పెట్టడం, మొదటి విజిల్ రాగానే మంటను సిమ్‌లో పెట్టడం ద్వారా కొంతమేరకు గ్యాస్‌ను ఆదా చేయవచ్చు.


బర్నర్‌లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి వృథాను అరికట్టవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top