పిల్లలో ఏకాగ్రత సమస్యకు హొమియో మేలు

బాల్యంలో చాలామంది పిల్లలు ఏకాగ్రత లోపంతోపాటు అతిగా ప్రవర్తిస్తుంటారు. దాన్ని చాలామంది తల్లిదండ్రులు మా వాడి స్వభావమే అంత అని భావిస్తుంటారు. కాని అతిగా వ్యవహరించటాన్ని పిల్లవాడి స్వభావం కాదని, అది ఒక మానసిక సమస్యగా గుర్తించాలి. పిల్లల్లో ఈ సమస్యనే అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్‌డి) అంటారు. 

సాధారణంగా పాఠశాలకు వెళ్లే పన్నెండేళ్లలోపు పిల్లలకు వివిధ కారణాల వల్ల ఏకాగ్రత లోపంతోపాటు అతిగా ప్రవర్తించే అలవాటు ఉంటుంది. 8 నుంచి 10 శాతం పిల్లల్లో కనిపిస్తున్న ఈ సమస్య బాలికల్లో కంటే బాలురలో ఎక్కువగా ఉంటుంది. ఆలోచించకుండానే అతిగా ప్రవర్తిస్తుంటారు.ఈ సమస్య ఉన్న పిల్లల్లో అటెన్షన్ తక్కువ ఉంటుంది. పిల్లల్లో ఇలాంటి సమస్యలకు అనువంశికత, తీసుకునే ఆహారం, పిల్లలు పెరిగే ఇంటితోపాటు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ప్రధాన కారణాలు. 75 శాతం కేసుల్లో పిల్లలకు ఇలాంటి సమస్యలు రావటానికి జన్యుపరమైన కారణాలని పరిశోధకులు తేల్చారు.

గర్భవతిగా ఉన్నపుడు మద్యం తాగినా, ధూమపానం చేసినా, తీవ్ర ఒత్తిడికి గురైనా దాని ప్రభావం పిండంపై పడి పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. పిల్లలు పెరిగే ఇంట్లోని వాతావరణం, తల్లిదండ్రుల వ్యవహార శైలి కూడా పిల్లల్లో మానసిక సమస్యలు ఏర్పడటానికి కారణమవుతుంది. ఇలాంటి సమస్యలున్న పిల్లలకు సకాలంలో చికిత్స చేయించకుంటే వారు విద్యలో వెనుకబడే అవకాశముంది. పిల్లల్లో మూడు రకాల మానసిక సమస్యలు ఏర్పడుతుంటాయి.

ఇన్అటెంటివ్ లక్షణాలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఏ విషయంలోనూ అటెన్షన్ చూపించరు. పిల్లలు సాధారణంగా నిశ్శబ్ధంగా ఉంటారు. చేసిన తప్పులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. హోం వర్క్ చేయటం మర్చిపోవటం, పుస్తకాలు, బొమ్మలు తరచూ పొగొట్టుకుంటుంటారు.


హైపర్‌యాక్టివ్ లక్షణాలు అతిగా వ్యవహరించే లక్షణం ఈ సమస్య ఉన్న పిల్లల్లో ఉంటుంది. ఇలాంటి పిల్లలు సాధారణంగా యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా ఆటలాడటం ఈ సమస్య ఉన్న పిల్లల లక్షణం. ఏదైనా యాక్టివిటీలో అతిగా స్పందిస్తుంటారు.

ఇంపల్సివ్ లక్షణాలు ఈ సమస్య ఉన్న పిల్లలు ఆకస్మాత్తుగా అనాలోచితంగా వ్యవహరిస్తుంటారు. నియంత్రణ కోల్పోతుంటారు. అసందర్భంగా మాట్లాడటం, తరగతి గదిలో సంబంధం లేని ప్రశ్నలు అడగటం చేస్తుంటారు. ప్రశ్నలు పూర్తిగా వినకుండానే సమాధానం చెప్పేందుకు ఉద్యుక్తులవుతుంటారు. ఇతర పిల్లలు ఆడుకుంటుంటే వారిని అడ్డుకోవటం లాంటి పనులు చేస్తుంటారు.
 

హోమియో చికిత్స మానసిక సమస్యలున్న పిల్లల వ్యవహారశైలి, వారి జీవనశైలి, సమస్య లక్షణాలను బట్టి హోమియో మందులు ఇస్తుంటారు. మానసిక సమస్యలున్న పిల్లలకు వారి లక్షణాలను బట్టి బరైటా కార్బ్, బరైటా ఐడేటమ్, కల్క్‌ఫాస్, స్ట్రమ్మోనియమ్, నక్స్‌వోమికా, కెన్నాబిస్ ఇండికస్, కార్సినోసిన్ తదితర హోమియో మందులను నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడితే సత్ఫలితాలుంటాయి. సాధారణంగా పాఠశాలకు వెళ్లే పిల్లలకు ఇప్పుడు వేసవి సెలవులు కావటంతో ఇంటి వద్ద ఉంటారు. ఈ సమయంలో పిల్లల వ్యవహారశైలిని తల్లిదండ్రులు గమనించేందుకు అవకాశముంటుంది. పిల్లల్లో మానసిక సమస్యలుంటే వాటిని గుర్తించి తక్షణం చికిత్స చేయిస్తే మేలు.

బరైటా కార్బొనికా : మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకు ఇది దివ్య ఔషధం. సిగ్గుపడటం, చిన్న విషయానికి కంగారు పడటం, నెమ్మదిగా వ్యవహరించే పిల్లలకు ఈ హోమియో మందు మంచి ఫలితమిస్తుంది.

బరైటా ఐడేటమ్ : చిరాకుతనం, తొందరపాటు ఎక్కువ, రెస్ట్‌లెస్‌గా ఉండే పిల్లలకు బరైటా ఐడేటమ్ అనే మందు బాగా పనిచేస్తుంది. తొందరగా నెర్వస్ కావటం, మనసు లగ్నం చేయకపోవటం, ఆకలి ఎక్కువ ఉన్న వారికి ఇది ఫలితాన్నిస్తుంది.
 

కెన్నాబిస్ ఇండికా : ఒంటరితనంగా ఫీలవటం, చిన్న విషయాలకు భయపడటం, గందరగోళ మనస్తత్వంతో పాటు ఏకాగ్రత లోపం ఉన్న పిల్లలకు ఈ మందు వాడితే ఫలితం ఉంటుంది.  


కాని ఈ మందులు అవగాహన కోసమే, డాక్టర్ సలహా తో మాత్రమే వాడాలి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top