పిల్లల్లో దొడ్డికాళ్లు...

పిల్లల్లో మోకాళ్ల వద్ద దూరం ఎక్కువగా ఉండటం అరికాళ్లు దగ్గరగా ఉండే పరిస్థితిని బౌడ్ లెగ్స్ లేదా జీనూవేరమ్ అంటారు. పుట్టిన పిల్లలందరూ దాదాపు ఎంతోకొంత బౌడ్ లెగ్స్‌తోనే ఉంటారు. పిండ దశలో శిశువు ముడుచుకుని (ఫోల్డెడ్ పొజిషన్‌లో) ఉండటమే దీనికి కారణం. దాంతో పుట్టిన పిల్లల్లో కాళ్లు ఇలా ఉండటం సర్వసాధారణం.

పిల్లలు నడక మొదలు పెట్టడం, తమ కాళ్లపై కొంత బరువు పెట్టడం ప్రారంభం కావడంతో... అంటే... ఒకటిన్నర-రెండు సంవత్సరాలప్పటి నుంచి కాళ్లు మామూలు కావడం మొదలై మూడేళ్ల వయస్సు వచ్చేసరికి నార్మల్ షేప్‌కు వస్తాయి. మూడేళ్లు పైబడ్డాక కూడా బౌడ్ లెగ్స్ ఎక్కువగా (సివియర్ బౌడ్ లెగ్స్) ఉంటే అలాంటి పరిస్థితికి కారణాలు ఏమై ఉంటాయా అని ఆలోచించాల్సి ఉంటుంది.



అంటే ఆ పరిస్థితి- రికెట్స్ వంటి వ్యాధుల వల్లనా, లెడ్ (సీసం), ఫ్లోరైడ్స్ వంటి విష పదార్థాల ప్రభావం ఎక్కువ కావడం వల్లనా లేదా ఎముకల షేప్ మారడం (బోన్ డిస్‌ప్లేసియాస్) వంటివా అని ఆలోచించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలతో బౌడ్ లెగ్స్ వస్తే వాటిని కాస్తంత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి పిల్లల్లో ఎక్స్‌రే, రక్తపరీక్షల వంటివి చేసి కారణాలు నిర్ధరించాలి. తగిన కారణాన్ని అన్వేషించాక దానికి తగిన చికిత్స చేయాలి.

పిల్లల్లో మూడేళ్ల వయసు వచ్చే వరకు ఈ సమస్య గురించి ఆలోచించాల్సి అవసరం ఉండదు. ఒకవేళ మూడేళ్ల తర్వాత కూడా అలాగే ఉంటే అప్పుడు పిల్లల నిపుణుడిని లేదా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top