రోజూ గుప్పెడన్ని వేపాకులు తింటే డయాబెటిస్ తగ్గుతుందని నాకు కొందరు సలహా చెబుతున్నారు. అలా తీసుకోవచ్చా?

వేపలో ఔషధగుణాలున్న మాట వాస్తవమే. వేపలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు ఆల్కలాయిడ్స్ వంటి రసాయనాలు ఉంటాయి. అయితే అదేమీ ఆకుకూర (వెజిటబుల్) కాదు. ఆకుకూర కానిదాన్ని అలా తినడం వల్ల మీకు గ్యాస్ట్రయిటిస్, కాలేయ సంబంధమైన ఇతర సమస్యలు రావచ్చు.

అందుకే ఔషధగుణాలున్న ఆకులను ఇలా నేరుగా తినడం సరికాదు. దాని నుంచి తీసుకున్న ఔషధాలను నిపుణుల పర్యవేక్షణలోనే వాడాలి. మీరు మీ డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు నిపుణులైన డాక్టర్లతో నిత్యం ఫాలోఅప్‌లో ఉంటూ మందులతో నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.


వేపాకును మాత్రమే కాదు... ఔషధ గుణాలున్న తులసి, నేరేడు ఆకులను కూడా నిపుణుల సలహా లేకుండా నేరుగా తినడం సరి కాదు. నిపుణులైన వైద్యులు వాటినుంచి తయారు చేసిన ఔషధాలను సూచిస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top