మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నదని గుర్తించడం ఎలా?

మూత్రపిండాలు శరీరంలోని మలినపదార్థాలను వేరుచేసి రక్తశుద్ధి చేస్తుంటాయి. అలా వేరుచేసిన పదార్థాలు మూత్రం రూపంలో బయటకు విసర్జితమవుతాయి. మూత్రపిండాలలోని అత్యంత సంక్లిష్టమైన నెఫ్రాన్ అనే భాగంలో ఈ వడపోత కార్యక్రమం, శుద్ధి ప్రక్రియ జరుగుతుంటాయి. ఏ కారణాల వల్లనైనా మూత్రపిండాలలోని ఆ నెఫ్రాన్‌లు పనిచేయకపోతే దాన్ని గుర్తించడం ఎలా అన్నది తెలుసుకుందాం.
కిడ్నీలు పనిచేయడంలేదని గుర్తించడం ఇలా...
 

మూత్ర పరిమాణం తగ్గడం
ముఖంపైన, శరీరంలో అనేకచోట్ల వాపు రావడం
వాంతులు కావడం

ఇతర శారీరక లక్షణాలు:
ఆకలి లేకపోవడం
నిద్రలేమి
వాంతులు
శరీరంలో అవయవాల వాపు
రక్తహీనత, కొన్ని సందర్భాల్లో ఆయాసం...

రక్తంలో మాలిన్యాలు పేరుకుంటున్నాయని గుర్తించే పరీక్షలు:
రక్తంలో సీరమ్ క్రియాటిన్ వంటి మాలిన్యాలు పెరగడం
బ్లడ్ యూరియా పెరగడం
పొటాషియం లవణాలు పెరగడం
కిడ్నీలు పనిచేయకపోతే... 

మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోతే డయాలసిస్ ద్వారా కృత్రిమంగా ఆ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా షుగర్, బీపీ వ్యాధుల వల్ల కిడ్నీలు పూర్తిగా చెడిపోయిన వారికి హీమోడయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తశుద్ధి నిర్వహిస్తుంటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top