స్థూలకాయం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంతో వచ్చే సమస్యలు, వాటికి పరిష్కారాలు

శరీరం బరువు పెరగడానికి కారణం...
ఒకచోట కూర్చుని పని చేసే వృత్తులు పెరగడం చిరుతిండి గతంలో కంటే ఎక్కువగా అందుబాటులోకి రావడం నూనె, కొవ్వులతో చేసిన ఆహారం వినియోగం పెరగడం వ్యాయామం లేకపోవడం పగటిపూట ఎక్కవగా పడుకోవడం, ఆహారం తీసుకోగానే విశ్రమించడం జన్యుపరమైన కారణాలు ఒత్తిడి ఎక్కువగా పెరగడం  

ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు: 
మనం టీవీ చూస్తూ ఆహారం తీసుకోకూడదు ఒత్తిడిలో ఆహారం తీసుకోకూడదు కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారాన్ని వీలైనంతగా తగ్గించాలి.  
కొవ్వు ఎక్కువగా ఎక్కడ పేరుకుంటుంది...
పొట్ట వద్ద పిరుదుల వద్ద తొడలు భాగంలో ఒక్కోసారి మెడ చుట్టూ, ముఖంలో, భుజాల్లో కూడా పేరుకోవచ్చు  
ఒబేసిటీ వల్ల వచ్చే సమస్యలు:  
డయాబెటిస్ హైబీపీ ఆర్థరైటిస్ పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) గుండెజబ్బులు కొన్ని రకాల క్యాన్సర్లు సంతానలోపం, అంగస్తంభన లోపాలు హైకొలెస్ట్రాల్ మహిళల్లో హార్మోనల్ మార్పులు, రుతుక్రమంలో మార్పులు, ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం జీర్ణక్రియ మందగించడం మానసిక (సైకోసొమాటిక్ ) సమస్యలు మూత్రసంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ మలబద్దకం గ్యాస్ట్రయిటిస్, అసిడిటీ ఛాతీలో మంటగా ఉండటం వాంతులు కావడం డయేరియా నడుము నొప్పి రావడం.
 స్థూలకాయం ఉన్నప్పుడు కనిపించే అంశాలు / లక్షణాలు:
ఒక వ్యక్తి కొద్దిపాటి పనిచేయగానే అలసట రావడం
నిద్రమత్తుగా ఉన్నట్లు అనిపించడం కొద్దిపాటి శ్రమతోనే ఎంతో చెమట పట్టడం ముఖంలో కళాకాంతులు తగ్గడం కీళ్లనొప్పులు తరచూ కూర్చుండిపోవడం
సమస్యలు: శరీరంలో ఉండాల్సిన దానకంటే ఎక్కువ కొవ్వు ఉన్నప్పుడు అది పనిచేసే వివిధ అంతర్గత అవయవాల మీద పేరుకుపోవచ్చు. దాంతో వాటి పనితీరు కూడా తగ్గవచ్చు. ఉదాహరణకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడం వల్ల గుండెజబ్బులు రావచ్చు. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం వల్ల గుండె మరింత ఎక్కువ శ్రమ తీసుకుని పనిచేయాల్సి రావచ్చు. దాంతో రక్తపోటు కూడా పెరగవచ్చు. ఒక్కోసారి కొవ్వులు ఎక్కువ పేరుకున్నప్పుడు అంతర్గత అవయవాలకు అందాల్సిన పోషకాలు కూడా అందకపోవచ్చు. దాంతో ఇతర సమస్యలు రావచ్చు. ఇలా కొవ్వులు పేరుకోవడం వల్ల జీవక్రియల్లోనూ మార్పులు రావచ్చు.
 స్థూలకాయం ఉన్నట్లు నిర్ధారణ కోసం...
బీఎంఐని పరీక్షించడం కొవ్వుల శాతం తెలుసుకోవడం లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్‌ఎఫ్‌టీ) సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) ఈఎస్‌ఆర్ లిపిడ్ ప్రొఫైల్
స్థూలకాయాన్ని ముందు నుంచే తగ్గించుకుంటూ ఉండాలి. ఫలితంగా దానితో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలను నివారించుకోచ్చు.
స్థూలకాయం తగ్గించుకోడానికి అవలంబించాల్సిన మార్గాలు:
ప్రతిరోజూ ఉదయం నడక (ఉదయం వేళలో కనీసం 5 కి.మీ. నడవాలి) సూర్యనమస్కారాలు ప్రాణాయామం ఆసనాలు (చక్రాసన, ధనురాసనాల వంటివి. అయితే ఆసనాలు ఏవైనా నిపుణుల పర్యవేక్షణలోనే వేయాలి) ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి ఒత్తిడిని వీలైనంతగా తగ్గించుకోవడం త్వరగా నిద్రకు ఉపక్రమించి వేకువజామునే నిద్రలేవడం ఆహారం తీసుకోగానే వెంటనే నీళ్లు తాగకపోవడం... వంటివి ఆచరణలో పెట్టాలి. స్థూలకాయం ఉన్నప్పుడు అది మాత్రమే శరీరానికి సమస్య కాదు. దాంతో ఎన్నో ఇతరత్ర అనుబంధ సమస్యలు కూడా రావచ్చు. అందుకే దాన్ని తగ్గించుకోవడం అవసరం.  
ఆయుర్వేద చికిత్సలు
ఒక చెంచా త్రిఫలా చూర్ణం... ప్రతిరోజూ కాస్త వేడినీటితో పడుకోబోయేముందు తాగాలి.
ప్రతి రోజూ లేవగానే పరగడుపున ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా తేనెలో, రెండు చెంచాల నిమ్మరసం కలుపుకుని తాగాలి.
విభితకి పౌడర్ భోజనం తర్వాత రెండు పూటలూ వాడాల్సి ఉంటుంది.
ఇక మరిన్ని వైద్య ప్రక్రియలను రోగిని, బరువును బట్టి పాటించాల్సి ఉంటుంది. అయితే వైద్య ప్రక్రియలన్నీ నిపుణులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలోనే తప్పనిసరిగా జరగాలి. 
బీఎంఐ 
మనకు స్థూలకాయం ఉందా అన్నదాన్ని తెలుసుకోడానికి ఒక సూచిక బీఎంఐ. దాన్ని తెలుసుకోడానికి మన బరువును కిలోగ్రాముల్లో తీసుకుని, ఆ సంఖ్యను మన ఎత్తు మీటర్ల స్క్వేర్‌తో భాగించాలి. అలా భాగించగా వచ్చిన సంఖ్యను బట్టి బాడీ మాస్ ఇండెక్స్ అంటారు.  

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 18.5 నుంచి 22.9 మధ్య ఉంటే అది నార్మల్.
ఆ సంఖ్య 23 నుంచి 24.9 ఉంటే అధిక బరువు (ఓవర్ వెయిట్) అని అర్థం.
అది 25 నుంచి ఆపైన ఉంటే ఒబేస్ (స్థూలకాయం) అని తెలుసుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top