పిల్లలకు డ్రెస్సులు కుట్టించేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎంపికలోనూ, కుట్టే విధానంలోను జాగ్రత్తలు

పిల్లలకు డ్రెస్సులు కుట్టించేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎంపికలోనూ, కుట్టే విధానంలోను జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. కొంచెం గుచ్చుకున్నా, అసౌకర్యంగా అనిపించినా ఆ డ్రెస్‌ను పిల్లలు అస్సలు ఇష్టపడరు.

పిల్లల మృదువైన చర్మానికి హాని కలిగించని మెత్తని క్లాత్‌ను ఎంపిక చేసుకోవాలి. ఛీజ్ కాటన్స్, మల్ మల్స్, మెత్తని నెటెడ్ క్లాత్ వాడాలి. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్, నేచురల్ డైస్ ఉన్నవి అయితే ఇంకా మంచిది. పార్టీవేర్ అయినా, సమ్మర్ అయినా, రెగ్యులర్ వేర్ అయినా చెమటను పీల్చుకునే క్లాత్‌నే ఎంపిక చేసుకోవాలి. 


డ్రెస్ లోపలి వైపు ఒంటికి ఏమాత్రం అసౌకర్యంగా లేనివిధంగా చూడాలి.

పిల్లలు బొద్దుగా ఉన్నా, సన్నగా ఉన్నా స్పగెట్టి, ఆఫ్ షోల్డర్ గౌన్లు సౌకర్యంగా ఉంటాయి కాబట్టి ఇష్టపడతారు.

సన్నగా ఉన్న పిల్లలకు స్పగెట్టి షోల్డర్ గౌన్లు వేస్తే మరీ సన్నగా కనిపిస్తారు. అందుకని గౌనంతా ఫ్రిల్స్ ఉండే విధంగా చూసుకోవాలి. ప్రిల్స్ ఉంటే స్పగెట్టి షోల్డర్స్ ఉన్నా బాగుంటుంది.

స్లిమ్‌గా ఉన్న పిల్లలకు ఫ్రిల్స్ ఉన్న గౌన్ల మీదకు ఓవర్‌కోట్ వేయాలి. బబుల్ గౌన్స్ కూడా వేయచ్చు.
 

బొద్దుగా ఉన్న పిల్లలు స్ట్రెయిట్ కట్ ఉన్న గౌన్లు, నీ లెన్త్ గౌన్లు వేయాలి.

నెట్ క్లాత్ అంతా లోపలివైపు కుచ్చు కుచ్చులు వచ్చేలా లైనింగ్ వేయాలి. ఇది ధరించినప్పుడు బెలూన్‌లా నిలుస్తుంది. దీంతో పిల్లలు బొద్దుగా కనిపిస్తారు.


ఏ స్కిన్ టోన్ అయినా...

పిల్లలకు అన్ని రంగులూ బాగానే ఉంటాయి. అందుకని కలర్ వేరియేషన్ చూసుకోనక్కర్లేదు. ఈవెనింగ్ వేసే డ్రెస్సులన్నీ మల్టీకలర్‌లో, బ్రైట్ కలర్‌వి ఎంపిక చేయండి. క్యాజువల్ వేర్‌కి లేత రంగులను ఎంపిక చేయండి.  


సన్నగా ఉన్న పిల్లలకు బోట్ నెక్స్ అందంగా ఉంటాయి.
బొద్దుగా ఉన్న పిల్లలకు స్పగెట్టి నెక్‌లైన్స్ బాగుంటాయి.
సన్నగా ఉన్న పిల్లలకు బుట్టచేతులు, కాటన్ క్రోషియోతో చేసిన గౌన్లు అందంగా ఉంటాయి.
పిల్లల ఫుట్‌వేర్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డ్రెస్ ఎంత రెగ్యులర్‌గా ఉన్నా మిక్కీ మౌస్, ఫ్లవర్స్... ఉన్న ఫుట్‌వేర్‌ని తీసుకోవాలి.
పిల్లల యాక్సెసరీస్‌లో ముందుగా షూస్‌కి, ఆ తర్వాత హ్యాట్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలి. వెడల్పాటి పెద్ద హ్యాట్ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు.
చలికాలంలో తప్ప ఏ సీజన్‌లో అయినా జ్యూయలరీ వాడక పోవడమే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top