పిల్లల్లో వినికిడిలోపాన్ని తెలుసుకోవడం ఎలా?

వినికిడి లోపం పైకి కనిపించేది కాదు, కాబట్టి దానిని తెలుసుకోవడం కొంచెం కష్టమే. తల్లిదండ్రులు... పిల్లల్లో నెలలు నిండేకొద్దీ ఉండాల్సిన సాధారణ అభివృద్ధి  పాపాయి విషయంలో ఉందా లేదా అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇందుకు కింది ప్రశ్నలు బాగా ఉపయోగపడతాయి. ఒకసారి పరిశీలించండి.

మూడు నుంచి ఆరు నెలల వయసు శిశువు...

నిద్రలో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వస్తే నిద్ర లేస్తోందా, ఉలిక్కిపడి ఏడుస్తోందా? మెలకువగా ఉన్నప్పుడు సామాన్య శబ్దాలకు ప్రతిస్పందిస్తోందా? పక్కన లేదా వెనుక నుంచి శబ్దం వస్తే తిరిగి చూస్తోందా? ఒక వైపు నుంచి వచ్చే శబ్దాలకు స్పందిస్తూ మరో వైపు శబ్దాలకు స్తబ్దుగా ఉంటోందా? మీరు మాట్లాడుతుంటే మీ భావాన్ని గ్రహించడం, తను కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం వంటివి ఉంటున్నాయా? బొమ్మలు చేసే శబ్దాన్ని ఆనందిస్తూ, వాటితో ఆడుకోవడానికి ఆసక్తి చూపుతోందా?



ఆరు నుంచి 12 మాసాల శిశువు...
నోటితో శబ్దాలు చేయడం, పెద్ద వాళ్లను అనుకరించడం వంటివి చేస్తోందా? 12 నుంచి 18 మాసాల శిశువు ‘అమ్మ, తాత’ వంటి చిన్న చిన్న మాటలను పలుకుతోందా? పది అడుగుల దూరం నుంచి పిలిస్తే ఆ పిలుపును గ్రహించి చూస్తోందా? మీరు బొమ్మల పేర్లు చెప్పి వాటిని చూపించమంటే చూపిస్తోందా? పై ప్రశ్నల్లో అన్నింటికీ ‘అవును’ అనే సమాధానం వస్తే పాపాయికి వినికిడి లోపం లేనట్లే. 



దేనికైనా ‘కాదు’ అనిపిస్తే వినికిడి లోపం ఉందని అర్థం, వెంటనే డాక్టరును సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి.వినికిడి లోపాన్ని చిన్నప్పుడే గుర్తించి చికిత్స చేయించుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. వయసు పెరిగేకొద్దీ ఫలితాల శాతం తగ్గుతుంది. కొద్దిపాటి లోపమే కదా అని నిర్లక్ష్యం చేస్తే వయసు పెరిగేకొద్దీ సమస్య తీవ్రమై పూర్తిగా చెవిటితనానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top