చక్కనైన శరీరాకృతి కోసం ‘చక్రాసనం’


అందం అంటే కేవలం ముఖ వర్ఛస్సు మాత్రమే కాదు. శరీరాకృతి కూడా పరిగణలోకి వస్తుంది. సన్నగా, నాజూగ్గా ఉండే అమ్మాయిలను మెరుపుతీగ అంటుంటారు కొందరు. నేటి జనరేషన్‌లో ‘జీరో సైజ్‌’ అంటారు. అయితే ఇలా మెరుపుతీగలా మారాలంటే అన్నపానాలు మాని ఉపవాసాలు ఉండక్కర్లేదు. మీ బిజీ షెడ్యూల్‌లో కొంత సమయం ‘చక్రాసనం’ చేయడానికి వెచ్చిస్తే చాలు. కొంత కాలం తరువాత అందమైన మార్పుని మీరే గమనిస్తారు.
చక్రాసనం :
వెల్లకిలా పడుకుని రెండు చేతుల్ని భుజాల వెనగ్గా చెవులకు ఇరువైపులా నేలకు ఆనించి ఉంచి... రెండు కాళ్లు , పిరుదుల దగ్గరగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ చేతుల్ని నేలకు బలంగా ఆనించి శరీరాన్ని పైకెత్తి కాళ్లకు ఆనించాలి. నాలుగు లేక ఆరు శ్వాసలు ఉన్న తరువాత శ్వాస వదులుతూ నెమ్మదిగా సమస్థితికి రావాలి. ఈ ఆసన స్థితిలో శరీర బరువంతా చేతులు, కాళ్లపై మాత్రమే ఉండాలి.దీనివల్ల చేతులు ఆకారాన్ని సంతరించుకుంటాయి. అనవసర కొవ్వూ త్వరగా కరుగి...శరీరం నవాకృతిని సంతరించుకుంటుంది.
గమనిక:
మెడనొప్పి ఉన్న వాళ్లు ఈ ఆసనం చేయక పోవడం మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top