నిద్రకి తగిన సమయం కేటాయిస్తున్నారా..?

మహిళలు ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఇంటి పనులు, వంట పనులు ..ఉద్యోగం చేసే మహిళలైతే ఆఫీస్‌పనులతో కూడా సతమతమవుతుంటారు. ఈ బిజీ బిజీ పనుల మధ్య తమ ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోరు మహిళలు. పురుషులతో పోల్చుకుంటే మహిళలు నిద్రపోయే సమయం చాలా తక్కువని అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలోని సైంటిస్ట్‌లు చెబుతున్నారు... వారి ప్రకారం...

  • పురుషులతో పోల్చితే మహిళలకు నిద్ర మరింతగా అవసర ముందని తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా నేడు చాలా మంది మహిళలు నిద్రాలేమితో బాధపడుతు న్నారట.కలత నిద్రతో బాధపడే మహిళలు తమ బాధ్యతలను నిర్వహించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారట.ప్రస్తుత నిద్రాసమయానికంటే వారికి మరింతగా 20నిముషాల నిద్ర అవసరమంటున్నారు.
  • చక్కని నిద్రతో ఆలోనచా శక్తితో పాటు,జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
  • మానసికంగా,శారీరకంగా ఫిట్‌గా ఉండగలుగుతారు.
  • ప్రతీరోజు ఒకే సమయానికి నద్రపోవడం...లేవడం చేయాలి.
  • సెలవులున్నా సరే నిద్రకు సెలవు ఇవ్వరాదు.
  • చక్కని నిద్రకోసం పడుకునే ముందు మంచి సంగీతాన్ని వినడం, పుస్తకాన్ని చదవడం, గోరువెచ్చని పాలు త్రాగడం వంటివి చేయవచ్చు. వీటిని పాటిస్తే హాయిగా నిద్రపోవటం గ్యారంటి.
  • శరీరానికి బిగుతుగా ఉండే వస్త్రాల కన్నా, వదులుగా ఉన్న కాటన్‌ దుస్తువులను ధరించడం మేలు.
  • నిద్రకు ఉపక్రమించే గంటముందే టి.వి.కి రిమోట్‌కి గుడ్‌నైట్‌ చెప్పండి. టీ, కాఫీని సేవించండి .కాసేపు మెడిటేషన్‌ చేయండి.
  • మీ బెడ్‌ రూమ్‌లో ఎక్కువగా వెళుతురు ఉండకుం డా చూడండి. అంతే కాకుండా ఎలాంటి ధ్వనులు మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయకుండా జాగ్రత్త పడండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top