రక్తవృద్ధికి ఏ ఆహారం బెస్ట్?

రక్తహీనతతో బాధపడే వారు ఐరన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. వెజిటేరియన్ అయినట్లయితే సోయాబీన్స్, పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్ ఎక్కువగా లభిస్తుంది.

నాన్-వెజ్ తినే అలవాటుంటే రోజూ ఒక కోడిగుడ్డు తినాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్ లభిస్తుంది. రక్తహీనత తగ్గాలంటే హీమోగ్లోబిన్ శాతం పెరగటంతో పాటు ప్రొటీన్, ఐరన్ శాతం పెరగాలి. ధాన్యాలు, రాగులు, గోధుమలలో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. ఆకుకూరల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఆహారంలో చింతపండు బదులుగా నిమ్మకాయ, టమాట ఉపయోగించాలి. దీనివల్ల ఐరన్ గ్రహించే శక్తి పెరుగుతుంది.

ఫ్రూట్స్ విషయానికొస్తే దానిమ్మ, పుచ్చకాయ బాగా ఉపయోగపడతాయి. డ్రైఫ్రూట్స్ విషయానికొస్తే జీడిపప్పు, బాదం తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. వీటితో పాటు అరలీటరు పాలు తప్పకుండా తాగాలి. పాలు లేదా పెరుగు రూపంలో అరలీటరు తీసుకోవాలి. బెల్లం తింటే ఐరన్ లభిస్తుంది. కానీ శరీరం గ్రహించే శాతం తక్కువగా ఉంటుంది. అందుకే ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకుంటే మనం తీసుకున్న ఐరన్ అధికంగా ఉన్న పదార్థాలను మన శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్య తొలగిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top