ఒబేసిటీ,డయాబెటిస్‌లకు చెక్ చెప్పే బేరియాట్రిక్ సర్జరీ

సాధారణం కంటే ఎక్కువగా బరువు ఉండటాన్ని ఒబేసిటీ (స్థూలకాయం) అంటారు. ఈ ఒబేసిటీ మధుమేహం, హృద్రోగ సమస్యలతోపాటు పలు రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. మనిషి జీవనపరిమాణాన్ని తగ్గించే స్థూలకాయం, డయాబెటీస్ సమస్యలను మెటబాలిక్ బేరియాట్రిక్ సర్జరీతో నివారించవచ్చంటున్నారు.

మనిషి ఎత్తును బట్టి ఎంతవరకు బరువు ఉండవచ్చన్నది బాడీమాస్ ఇండెక్స్ (బీఎంఐ) చెపుతుంది. బీఎంఐ సాధారణం కంటే అధికంగా ఉంటే ఒబేసిటీ, మార్పిడ్ ఒబేసిటీ అంటారు. బాడీమాస్ ఇండెక్స్ 37.5 ఉంటే... స్థూలకాయాన్ని తగ్గించేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఒబేసిటీతోపాటు మధుమేహ వ్యాధి ఉంటే బీఎంఐ 32.5 ఉన్నా ఆపరేషన్ అవసరం. మధుమేహవ్యాధిగ్రస్థులై ఉండి, బీఎంఐ 27.5 నుంచి 32.5 వరకు ఉన్న వారికి మందులు వాడినా షుగర్ కంట్రోల్ కాకుంటే వారికి కూడా బేరియాట్రిక్ సర్జరీతో ఒబేసిటీతోపాటు మధుమేహాన్ని తగ్గించవచ్చు. టైపు 2 డయాబెటీస్‌తోపాటు స్థూలకాయమున్న వారికి బేరియాట్రిక్ మెటబాలిక్ సర్జరీ ఒక వరంగా మారింది. బీఎంఐ 35 దాటిన వారు మందులు వాడినా, వ్యాయామం చేసినా, డైటింగ్ చేసినా స్థూలకాయం తగ్గదు. అలాంటి వారికి ఒబేసిటీని తగ్గించేందుకు సర్జరీ ఒక్కటే దోహదం చేస్తుంది.
 

అనారోగ్యాలకు మూలం ఈ ఒబేసిటీ పలు రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. మనిషిని చాలా రకాలుగా బాధిస్తుంది. స్థూలకాయం ఉన్న వారికి మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. హృద్రోగాలు, ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. అధిక కొలెస్ట్రాల్‌తోపాటు జాయింట్‌లు అరిగిపోయి తీవ్రమైన నొప్పికి దారితీస్తాయి. స్థూలకాయంతో యుటిరైన్, పాంక్రియాటిక్, బ్రెస్ట్ క్యాన్సర్‌లు కూడా వచ్చే అవకాశముంది. స్థూలకాయులకు రాత్రివేళ ఊపిరి ఆడకుండా స్లీప్ ఆర్నియా అనే సమస్య ఏర్పడుతుంది. లావుగా ఉన్నవారిలో ఆత్మన్యూనతాభావంతో మానసిక సమస్యలు కూడా రావచ్చు. స్థూలకాయం ఉన్న వారి ఎత్తు, బరువును బట్టి బాడీమాస్ ఇండెక్స్ ద్వారా బేరియాట్రిక్ సర్జరీ అవసరమా కాదా అనేది నిర్ధారిస్తారు. ఒబేసిటీ ఉన్న వారికి థైరాయిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్ సీరమ్ ఇన్సులిన్, గ్యాడ్ యాంటీబాడీస్ పరీక్షలు చేస్తారు. ఆయా పరీక్షల రిపోర్టులు చూసి బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. సాధారణంగా 20 నుంచి 60 ఏళ్ల వయసు వరకు గల స్త్రీ, పురుషులకు స్థూలకాయాన్ని తగ్గించేందుకు ఈ సర్జరీ చేస్తారు.

ల్యాప్రోస్కోపిక్ స్లీప్ గ్రాస్ట్రోక్టమి స్థూలకాయాన్ని తగ్గించేందుకు చేసే ఈ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సాయంతో చేస్తారు. పొట్ట వద్ద 5 మిల్లీమీటర్లు లేదా ఒక సెంటీమీటరు మేర చిన్న రంధ్రం చేస్తారు. రోగికి జనరల్ అనస్థీయా ఇచ్చి చేసే ఈ సర్జరీలో ల్యాప్రోస్కోపిక్ కెమేరాతో కంప్యూటర్‌లో చూస్తూ, స్టెప్‌లార్ సాయంతో 70 శాతం జీర్ణాశయాన్ని కట్ చేస్తారు. జీర్ణకోశాన్ని అరటిపండులా సన్నని ట్యూబ్ చేస్తారు. దీని వల్ల అన్నాశయం కెపాసిటీ తగ్గుతుంది. దీనివల్ల కొంచెం తినగానే కడుపు నిండుతుంది. ఈ సర్జరీతో ఘ్రెనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి స్థాయి తగ్గుతుంది. జీఎల్‌పీ 1 అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఘ్రెనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గటంతోపాటు జీఎల్‌పీ 1 హార్మోన్ ఉత్పత్తి పెరగటం వల్ల యాంటీ ఇన్సులిన్ ఎఫెక్ట్ తగ్గిపోయి, డయాబెటీస్ వ్యాధి అదుపులోకి వస్తుంది. కీ హోల్ సర్జరీ వల్ల పొట్ట వద్ద ఎలాంటి కుట్లు, మచ్చలు ఏర్పడవు.

గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ ఒబేసిటీని తగ్గించేందుకు చేసే ఈ సర్జరీలో జీర్ణాశయాన్ని చిన్న సంచిలాగా తయారు చేసి, చిన్న పేగును తెచ్చి జాయింట్ చేస్తారు. దీనివల్ల తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు. కొంత ఆహారం మాత్రమే జీర్ణం అవుతుంది. స్థూలకాయం వల్ల వచ్చే టైపు 2 మధుమేహ వ్యాధిని ఈ సర్జరీతో శాశ్వతంగా నివారించవచ్చు. మందులు వాడినా 50 శాతం మంది రోగుల్లో డయాబెటీస్ నియంత్రణ సక్రమంగా జరగదు. ఈ ఆపరేషన్‌తో ఒబేసిటీతోపాటు మధుమేహ సమస్యను పరిష్కారమవుతుంది.


ఎన్నెన్నో ప్రయోజనాలు మెటబాలిక్ బేరియాట్రిక్ సర్జరీతో పలు ప్రయోజనాలున్నాయి. స్థూలకాయం, మధుమేహ వ్యాధి శాశ్వతంగా తగ్గటంతోపాటు అందంగా, యవ్వనంగా కనిపిస్తారు. ఈ సర్జరీతో మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు జీవితకాలం మందులు వాడాల్సిన పని ఉండదు. 80 శాతం మందికి షుగర్ వ్యాధి తగ్గే అవకాశముంది. ఇందులో 60 శాతం మందికి శాశ్వతంగా తగ్గవచ్చు. సర్జరీ అనంతరం హార్మోన్ల ఉత్పత్తిలో జరిగే మార్పుల వల్ల మధుమేహ వ్యాధి అదుపులో ఉండటాన్ని గమనించాం. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత రెండు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. వారంరోజుల్లోనే రోగి సాధారణ విధులకు వెళ్లవచ్చు. ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే ఈ సర్జరీ వల్ల త్వరగా రోగి కోలుకోవటంతోపాటు తక్కువ నొప్పి ఉంటుంది. స్థూలకాయం వల్ల వచ్చిన అన్ని రకాల అనారోగ్యాలు దూరం అవుతాయి. ఒబేసిటీ తగ్గటం వల్ల వారిలో ఆత్మన్యూనతాభావం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సురక్షితమైన శస్త్రచికిత్స

స్థూలకాయాన్ని తగ్గించే బేరియాట్రిక్ మెటబాలిక్ సర్జరీ సురక్షితమేనా అని ప్రజల్లో పలు అపోహలున్నాయి. కాని అభివృద్ధి చెందిన వైద్య పద్ధతులతో ఈ సర్జరీని సురక్షితంగా చేయవచ్చు. నిపుణులైన వైద్యులతో అత్యాధునికమైన పరికరాలు, సౌకర్యాలున్న హాస్పిటల్స్‌లో చేసే సర్జరీలతో ఎలాంటి కాంప్లికేషన్‌లు రావు. ఒబేసిటీ ఉన్న వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా కంప్రెస్‌డ్ డివైజ్, ప్రీవెంటీవ్ ఎక్విప్‌మెంట్, హెపారిన్ మందులతో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని సర్జరీ చేస్తారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top