టర్మ్ పాలసీ ఎందుకు తీసుకోవాలి? దాని గురించి కొన్ని విషయాలు సంక్షిప్తంగా...

దేవుడి హుండీలో డబ్బులు వేస్తాం. దానికి లాభం బేరీజు వేసుకుని వేస్తామా? లేదు కదా... ఒక్క మాటలో చెప్పాలంటే టర్మ్ పాలసీ కూడా అచ్చం అలాంటిదే. ‘టర్మ్ పాలసీ’ పాతికేళ్లొచ్చిన ప్రతి మనిిషీ తీసుకోవాల్సిన పాలసీ. అంత ముఖ్యమైన దాని గురించి కొన్ని విషయాలు సంక్షిప్తంగా...

పాలసీ కాలంలో మనిషి అకస్మాత్తుగా మరణిస్తే పెద్దమొత్తంలో ఆ వ్యక్తి కుటుంబానికి డబ్బులు అందించే ఆపద్బంధువే టర్మ్ పాలసీ. సాధారణ పాలసీలో వేలల్లో కడితే లక్షల్లో వస్తుంది. టర్మ్ పాలసీలో రూపాయిల్లో కడితే చాలు లక్షల్లో (భారీ మొత్తం) అందుతుంది. అదీ తేడా! అయితే, పాలసీ కాలం అయిపోయినా మీరు జీవించి ఉంటే ఒక్కపైసా కూడా తిరిగి రాదు. ‘దేవుడా నన్ను క్షేమంగా చూసుకో’ అని హుండీలో డబ్బులు వేసినట్లు భావించి టర్మ్ పాలసీ చేయించండి. డబ్బులు తిరిగి రాలేదనుకోండి దేవుడు మిమ్మల్ని బాగా చూసుకున్నట్టు. లేదంటే మీ కుటుంబాన్ని బాగా చూసుకున్నట్టు.

ఏం తేడా: 

సాధారణ జీవిత బీమా పాలసీలో పాతికేళ్ల కాలానికి 25 లక్షల పాలసీ చేయించాలంటే ఏడాదికి సుమారు లక్ష రూపాయలు చెల్లించాలి. టర్మ్ పాలసీలో సుమారుగా పదివేలు చెల్లిస్తే సరిపోతుంది. కాకపోతే మనం క్షేమంగా ఉంటే డబ్బులు తిరిగిరావు.
ఎంతకు చేయించాలి:

 మీ సంవత్సరాదాయానికి పది పన్నెండు రెట్లు! అప్పులుంటే అదీ కలపండి.
ఎంత కాలానికి చేయించాలి: 

మీ పదవీ విరమణ వయసు నుంచి ప్రస్తుత వయసు తీసేస్తే ఎంత వస్తుందో అంతకాలానికి చేయించండి. ఇప్పటికే మీ వయసు 35 దాటితే మరో ఐదేళ్ల కాలానికి అదనంగా చేయించినా నష్టం లేదు.
ఎక్కడ కట్టాలి:
 అన్ని బ్యాంకులు/బీమా కంపెనీలు ఏజెంట్లను నియమిస్తాయి. వారితో కడితే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఆన్‌లైన్లో కడితే మీకు కొంత ఆదా అవుతుంది.
ఏం చేయాలి: 

కంపెనీ క్లెయిమ్ హిస్టరీని పరిశీలించాలి. ఏ సంస్థ తక్కువ ప్రీమియానికి ఎక్కువ ఇస్తుందో కనుక్కోవాలి. ఐదేళ్లకోసారి పాలసీ మొత్తాన్ని పెంచడానికి ప్రయత్నించండి.
ఏం చేయకూడదు:

 మీ ఆరోగ్య, అలవాట్ల విషయాలేవీ దాచకూడదు. కంపెనీ అడిగిన విషయాలన్నీ కరెక్టుగా చెబితే పాలసీ చెల్లుబాటు అవుతుంది. లేకపోతే అసలుకే మోసం వస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top