పూర్వం ఒక యజమాని వద్ద సింగడు అనే పనివాడు ఉండేవాడు. చాలా కష్టపడి పని
చేసేవాడు, స్వామిభక్తి కలవాడు. అయితే వట్టి వెర్రి బాగులవాడు. ఓ రోజు
రాత్రి యజమాని తన భార్యతో ‘రేప్పొద్దున్నే సింగడిని అద్దంకి పంపించాలి’ అని
అంటూ ఉంటే విన్నాడు. తెల్లవారి లేవగానే ‘యజమాని ఎలాగూ అద్దంకి వెళ్లి
రమ్మంటాడు కదా, అందుకని ముందుగానే వెళ్లొస్తే సరి’ అనుకుని రాత్రికి రాత్రే
పదిమైళ్లు నడిచి అద్దంకి వెళ్లొచ్చి ఏమీ ఎరగనట్టు పడుకున్నాడు.
మర్నాడు పొద్దున్నే యజమాని అద్దంకి వెళ్లిరావాలి సింగా’ అని చెబుతుంటే ముసిముసిగా నవ్వుకుంటూ తాను రాత్రే అద్దంకి వెళ్లొచ్చానని చెప్పడంతో వీడి అతి తెలివికి, అమాయకత్వానికి ఏమనాలో తెలీక ముక్కుమీద వేలేసుకున్నాట్ట. పక్కనున్న వారు ఈ విషయం కాస్తా అందరికీ చెప్పడంతో ఇది సామెతగా మారిపోయింది.