వేసవిలో ఒళ్లంతా కమిలిపోయినట్టు అవుతుంది. ఎండలో తిరిగిన తర్వాత మొహమంతా వాడిపోతుంది. దీన్నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎండలో ప్రయాణం చేసినవారు ఇంటికి రాగానే రెండు టేబుల్ స్పూన్ల కీరా గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి మొహానికి పట్టించి పదినిమిషాల తర్వాత చల్లటినీటితో కడిగేసుకుంటే చర్మం తేమగా ఉంటుంది.
- తలలో వేడిని తగ్గించడానికి అర కప్పు కీరాగుజ్జులో ఒక టేబుల్ స్పూను మెంతికూర గుజ్జు కలిపి మాడుకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.
- కళ్లు బాగా అలసిపోయినట్లు అనిపిస్తే రెండు కీరా ముక్కలు కళ్లపైన పెట్టుకుని నిద్రపోవాలి. ఫేస్‌ప్యాక్‌లో ఒక టీ స్పూను కీరాగుజ్జుని కలిపి రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.