మ్యాంగో ప్లమ్ కేక్...



 కావలసిన పదార్థాలు: 
మామిడి పండ్లు - మూడు, గుడ్లు - మూడు, మైదా - 200గ్రాములు, పంచదార - 200 గ్రాములు, పెరుగు - 150 గ్రాములు, కర్జూరం, కిస్‌మిస్‌లు, - ఒక కప్పు, ఆరెంజ్ లెమన్ కాండీడ్ ఫ్రూట్ పౌడర్ - ఒక టేబుల్ స్పూను, రమ్ము - మూడు టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూను, బాదం, జీడి పప్పు - పావు కప్పు.

తయారుచేయు విధానం:
 ముందురోజు రాత్రి రమ్ములో జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌లు, కర్జూరం వేసి నానబెట్టుకోవాలి. గుడ్డుసొనని బాగా గిలకొట్టాలి. ఇందులో మైదా, పెరుగు, పంచదార, ఆరెంజ్ లెమన్ కాండీడ్ ఫ్రూట్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, నానపెట్టిన డ్రైఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. దీన్ని బ్రెడ్ మౌల్డ్‌లో పెట్టి ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బేక్ చేయాలి. కేక్ బాగా చల్లారేలోపులో మామిడిపండు గుజ్జుని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి మ్యాంగో క్రీము తయారుచేసుకోవాలి. క్రీము బాగా తియ్యగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూను పంచదార వేయాలి. దీన్ని కేక్‌పైన వేసి అందంగా అలంకరించుకోవాలి. కేకు కింది భాగంలో వైట్ కేక్ క్రీముతో డిజైన్ వేసుకోవాలి. కేక్ మధ్యలో రెండు స్ట్రాబెర్రీలు గుచ్చితే చూడ్డానికి అందంగా ఉంటుంది. ఈ కేక్‌ని ఓ అరగంట ఫ్రిజ్‌లో పెట్టి తీస్తే మామిడి గుజ్జు గట్టిపడి తినడానికి బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top