మధుమేహ వ్యాది నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నల్లద్రాక్ష తింటే ఒంట్లో చక్కెరస్థాయి అదుపులో ఉంటుందని చెబుతున్నారు అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీవారు. మూడు నెలలపాటు ఎలుకలపై చేసిన ప్రయోగంలో నల్లద్రాక్షలు తిన్నవాటికి రక్తపోటు, చక్కెరస్థాయి అదుపులో ఉన్నట్టు తేలింది. పుల్లగా ఉండే నల్లద్రాక్షల్లో చక్కెరశాతం చాలా తక్కువగా ఉండి, మన రక్తంలోని చక్కెర నిల్వల్ని తగ్గించే శక్తి ఉందని చెబుతున్నారు పరిశోధకులు. మామూలుగానే జ్యూస్‌లలో నల్లద్రాక్షను బాగా ఉపయోగిస్తుంటారు. మధుమేహంతో ఇబ్బందిపడేవారు నాలుగు పండ్లు ఎక్కువ వేసుకుంటే మంచిదంటున్నారు పరిశోధకులు.
నల్లద్రాక్ష ఔషదం...
teluguLifestyle Editor
10:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.