మోసపూరిత ఈమెయిల్స్ (ఫిషింగ్ ట్రాప్‌)నివారించే చిట్కాలు

సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ మెయిల్స్ ద్వారా వివిధ రకాలుగా నెటిజన్లను మోసగిస్తున్నారు. మోసపూరిత యూఆర్ఎల్స్‌తోపాటు ఫిషింగ్ ఈమెయిల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయక పోవటమే ముందుజాగ్రత్త. అధికారిక వెబ్‌సైట్స్‌ను మినహా అనుమానాస్పద ఈమెయిల్స్ ద్వారా వచ్చిన లింక్స్‌ను సరిగా చూడకుండానే గుడ్డిగా కాపీ అండ్ పేస్ట్ చేయవద్దు. ఫేక్ లింక్స్‌తో, యూఆర్ఎల్స్ ద్వారా వచ్చిన ఫిషింగ్ మెయిల్స్ నుంచి రక్షణ పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

- మీరు మౌస్‌ను ఏదైనా లింక్‌పై క్లిక్ చేసేముందు ఒరిజినల్ వెబ్‌సైట్ అడ్రస్సా, లేదా దాని పేరిట ఉన్న మాస్క్‌డ్ ఫిషింగ్ సైటా అన్నది సరిచూసుకోవాలి.

- @ sign ఉన్న యూఆర్ఎల్ సైట్స్‌ను క్లిక్ చేయకుండా జాగ్రత్త పడండి. ఈ క్యారెక్టర్ ఉన్న సైట్‌ను ఫిషింగ్ సైట్‌కు తీసుకువెళుతుందని గుర్తించండి.

- మీరు క్లిక్ చేసే ముందు యూఆర్ఎల్ స్పెల్లింగ్‌ను సునిశితంగా పరిశీలించండి. ఒక్క క్యారెక్టర్ మార్చి మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు వాళ్ల ఫిషింగ్ వెబ్‌సైట్‌లోకి తీసుకువెళతారు. జాగ్రత్త!


- లింక్ సరిగా లేని అడ్రసులు మిమ్మల్ని అఫీషియల్ వెబ్‌సైట్స్‌లోకి తీసుకెళ్లవని గుర్తించండి.

http://198.162.256.56 /wood/index.htm లా ఇలా అంకెలతో ఉన్న ఐపి అడ్రసులను మీరు నమ్మకండి.

- మీరు అనుమానాస్సద అటాచ్‌మెంట్స్‌ను డౌన్‌లోడ్ చేయకుండా ఉండటం మంచిది. మీకు ఆ డౌన్‌లోడ్ తప్పనిసరి అవసరమైతే దాన్ని సపరేట్‌గా స్కాన్ చేసి నిజమైన యూఆర్ఎల్‌ను గుర్తించండి.

- జెన్యూన్ ఈమెయిల్స్ వారి పేరిట లేదా వారి అకౌంట్ నెంబరుతో ఉంటాయి కాబట్టి వాటినే క్లిక్ చేయండి.

- జెన్యూన్ యూఆర్ఎల్‌ను గుర్తించేందుకు సెక్యూర్ సాకెట్ లేయర్ (ఎస్ఎస్ఎల్) సెక్యూరిటీతో ఫిషింగ్ మెయిల్స్, సైట్స్‌ను గుర్తించవచ్చు.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top