సెగ్గడ్డలకు ప్రథమ చికిత్స ఏమిటి?


వేసవిలో సాధారణంగా సెగగడ్డలు ఎక్కువగా వస్తాయి. ఇవి సాధారణంగా స్టెఫలోకోకస్, స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల ఎక్కువగా వస్తుంటాయి.
గడ్డ ముదరక ముందే తగ్గించడానికి ఒక మగ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో బెటడిన్ లోషన్ వేసి, ఒక ఉతికిన మృదువైన బట్టను పది పదిహేను నిమిషాలు ఉంచితే గడ్డ పగిలి మరింత పెరగకుండా ఉంటుంది.

వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి హై ప్రోటీన్ డైట్ (గుడ్డులోని తెల్లసొన భాగం వంటి ఆహారం) తీసుకోవాలి.
జింక్, మల్టీ వైటమిన్ టాబ్లెట్లు తీసుకోవడం వల్ల కూడా సెగ్గడ్డలు త్వరగా తగ్గుతాయి.
త్వరగా తగ్గడం కోసం ఇంట్లో ఉండే పసుపు, గంధం వంటివి పూయకూడదని గుర్తుంచుకోవాలి. దానివల్ల ఒక్కోసారి పరిస్థితి తీవ్రం కావచ్చు.
గడ్డలపైన పైపూతగా యాంటీబయాటిక్ ఆయింట్‌మెంట్స్ గాని, టాబ్లెట్స్ గాని వాడేముందు డాక్టర్ల సలహా తప్పక తీసుకోవాలి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top