సండే సెలవు వచ్చిందంటే చాలు...మీ కుటుంబ సభ్యులతో కలిసి ఫన్‌డేను సందడిగా గడపండి.

సండే సెలవు వచ్చిందంటే చాలు...మీ కుటుంబ సభ్యులతో కలిసి ఫన్‌డేను సందడిగా గడపండి. మీ భార్యా పిల్లలతోపాటు సెలవు రోజును ఆనందంగా గడిపేలా ప్లాన్ చేసుకోవచ్చు.
 *మీ సకుటుంబ సమేతంగా సమీపంలోని ఓ పార్కు లేదా రిసార్ట్ లేదా జూపార్కును సందర్శించి ప్రకృతి ఒడిలో పరవశించండి.
*మీ పిల్లలతో కలిసి సరదాగా బైక్ రైడింగ్ లేదా సైకిల్ ట్రిప్‌కు వెళ్లండి.
*కుటుంబసభ్యులతో కలిసి మీ ఇంటికి సమీపంలో ఉన్న పెట్ స్టోర్‌ను సందర్శించి, అక్కడ ఉన్న రకరకాల పెంపుడు జంతువులతో సరదాగా గడపండి.
*భార్యా,పిల్లలతో కలిసి పెయింటింగ్, డ్రాయింగ్, గార్డెనింగ్, ఫోటోగ్రఫీ పనిలో నిమగ్నమవండి. దీనివల్ల మీ పిల్లల్లో కొంత సృజనాత్మకత పెంపొందుతుంది.
*మీ ఇంటిల్లిపాదిని సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు తీసుకువెళ్లి కాసేపు జలాకాలాడి సేద తీరండి.
*మీ ఇంట్లోని ఫోటో ఆల్బమ్ లేదా ఫ్యామిలీ స్లైడ్స్, మీకు నచ్చిన కుటుంబ కధాచిత్రాన్ని చూస్తూ ఆనందంగా గడపవచ్చు.
*పియానో, గితార్, లేదా వీణతో కాసేపు మీకున్న సంగీత ప్రావీణ్యాన్ని కుటుంబసభ్యుల సమక్షంలో ప్రదర్శించవచ్చు.
*మీ స్నేహితులు లేదా బంధువుల ఫ్యామిలీని పిలిచి వారితో కలిసి భోజనం చేసి సరదాగా ఆటలాడుకోవచ్చు.
*మీ కుటుంబసభ్యులతో కలిసి బ్యాడ్మింటన్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, టెన్నిస్ లాంటి గేమ్‌లు ఆడవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top