దీర్ఘకాలిక వ్యాధులు... చికిత్స



ఏళ్ల తరబడి వస్తూ, కొన్నిసార్లు తగ్గినా మళ్లీ తీవ్రతతో మాటిమాటికీ తిరగబెడుతూ వచ్చే ఆరోగ్య సమస్యలను దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటారు. వ్యాధులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

తక్షణం వచ్చి ప్రభావం చూపే ‘తరుణ’ వ్యాధులు (ఆక్యూట్) 

తిరగబెడుతూ వచ్చి పోతుండే ‘దీర్ఘకాలిక’ వ్యాధులు (క్రానిక్) 

దీర్ఘకాలిక వ్యాధులుగా హైబీపీ, కీళ్లనొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, హైకొలెస్ట్రాల్, డయాబెటిస్ వ్యాధులను మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇవి 20 నుంచి 60 ఏళ్ల వారిలో 60శాతం మందిలో, 60 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం పైన కనిపిస్తూ ఉంటాయి. ఇలా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో వయసు పైబడుతున్న కొద్దీ ఒకటి కంటే ఎక్కువ సమస్యలు 77శాతం మందిలో కనిపిస్తుండటం సాధారణమే. 

మన దేశంలో కూడా పొగాకు, ఆల్కహాల్, గుట్కా, డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలా దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయి. మధుమేహం, టీబీ, గుండెజబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువ. 

క్రానిక్ డిసీజ్ అని గుర్తించడానికి అవసరమైన అంశాలు : 
మళ్లీ మళ్లీ తిరగబెట్టడం ఒక వ్యాధి మూడు నెలలకు పైగా ఉండటం వంశపారంపర్యంగా రావడం నివసించే ప్రదేశాలు, తీసుకునే ఆహారం, పొగాకు నమలడం (ఏ రూపంలో అయినా)... వంటి అంశాల వల్ల వ్యాధి వచ్చి దీర్ఘకాలం బాధపడాల్సి రావడం మందులు వాడినప్పుడు ఉపశమనం ఉన్నా... మానేయగానే వ్యాధి తీవ్రత మళ్లీ పెరగడం చేసే వృత్తికి సంబంధించి వ్యాధి సంక్రమించి, పదే పదే 
బాధపెట్టడం,దీర్ఘకాలిక వ్యాధి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

నిపుణులైన వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. 

కుటుంబ సభ్యులు ప్రేమ, ఆప్యాయతలతో చికిత్స అందించాలి. 

ఫిజియోథెరపీ వంటి ప్రక్రియలు అనుసరించాల్సి రావచ్చు. 

దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో దృక్పథం... చికిత్స: 

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు హోమియోలో చికిత్స గురించి హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమన్ చాలా సంవత్సరాల కిందటే పరిశోధనలు చేసి ఇవి సోరా, సైకోసిస్, సిఫిలిస్ అనే శారీరక, మానసిక తత్వాలతో వస్తాయని చెప్పారు. వాటినే మియాజమ్స్ అంటారని పేర్కొన్నారు. హోమియో పరిభాషలో ప్రతి ఆరోగ్య సమస్యకు ఇవి మూలకారణాలు. ఈ మియాజమ్స్ అన్నవి ఒకటి లేదా రెండుమూడు కలిసిగాని అనారోగ్యానికి కారణం కావచ్చు. ఇవి మనలో ఉండే వ్యాధి నిరోధకశక్తిని దెబ్బతీసి తరుణ (అక్యూట్ ) లేదా దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. వీటిని నివారించాలంటే మియాజమ్స్‌ను అర్థం చేసుకుని వాటికి తగినట్లుగా కన్స్‌టిట్యూషన్ మెడిసిన్‌ను సరైన 
మోతాదులో ఇస్తే దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించడం / నివారించడం సాధ్యమవుతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top