ఇ-మెయిల్స్‌ను మరిస్తే ఆనందం మీవెంటే

ఒత్తిడికి దూరంగా ఉండటానికి ఉద్యోగస్తులు విహారయాత్రకే వెళ్లాల్సిన అవసరం లేదని కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యాపకులు అంటున్నారు. దానికి బదులుగా కొన్ని రోజులపాటు ఇ-మెయిల్స్‌కు దూరంగా ఉంటే చాలని వారు చెబుతున్నారు. విహారయాత్రలకే కాదు స్వర్గానికి వెళ్లినా అక్కడ ఇ-మెయిల్స్ చెక్ చేసుకుంటూ, వాటికి సమాధానాలు ఇస్తూ గడిపితే ఆనందమనేదేమీ ఉండదని వారు అంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు వాళ్లొక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.


ఐటీ రంగం నుంచి హోటల్ రంగం వరకు ఐదారు రకాల ఉద్యోగులను ఎంచుకుని వారికి నెల పాటు ఒక ప్రత్యేక విడిది ఏర్పాటు చేశారు. ఆ విడిదిలో ఉన్నప్పటికీ ఇ- మెయిల్స్‌ను చూడగానే వారిలో కలిగే స్పందనలు, ఇబ్బంది, అసౌకర్యం వీటన్నిటినీ గుర్తించారు. ఆ సమయంలో వారి హృదయ స్పందనలు పెరగడం కూడా గమనించారు. ఇ-మెయిల్స్‌కు పూర్తిగా దూరం చేస్తే చాలు వారిలో ఉత్సాహం అమాంతం పెరగడం, ఒత్తిడి లేకుండా గడపడాన్ని గుర్తించారట. ఆధునిక మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తున్న కంప్యూటర్ వగైరా పరికరాల పరిశీలనలో భాగంగా వాళ్లు ఈ ప్రయోగం చేశారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top