కొవ్వు పదార్థం అంటే అది విధిగా చెడు చేసేదే కానక్కర్లేదు. మీకు ఒక విషయం తెలుసా? శరీరం బరువు తగ్గడానికి కూడా కొన్ని కొవ్వులు కావాలి. కొవ్వు పదార్థాలు చెడ్డవనే అపోహతో వాటిని తీసుకోడానికి పూర్తిగా నిరాకరించకండి. వెన్న, నెయ్యి వంటి ఆహారాలతో వచ్చే ట్రాన్స్ ఫ్యాట్స్, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడాన్ని తగ్గించుకోండి. అయితే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, ఒమెగా 6, ఒమెగా 9 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి కొవ్వులు మనకు చాలా మేలు చేస్తాయి. ఈ తరహా కొవ్వు పదార్థాలు చేపల్లో, అవిశె నూనెలో ఉంటాయి. కొవ్వు పదార్థాలన్నీ చెడ్డవే అనుకునే చాలా మంది వాటిని తీసుకోవడం తగ్గిస్తారు. అలాంటివారిలో చర్మం పూర్తిగా పొడిబారిపోవడం వంటి అనర్థాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కొవ్వు పదార్థాలు ఎప్పుడూ చెడ్డవేనా...?
teluguLifestyle Editor
11:52:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.