తక్షణం శరీరంలోకి ఇంకిపోయే ప్రొటీన్లు సమకూరాలంటే గుడ్లకు మించిన ఆహారం లేదు. శరీరం ఎదుగుదలకూ, కండరాల నిర్వహణ (మజిల్ మెయింటెనెన్స్)కు గుడ్డు కంటే మంచి ఆహారం లేనేలేదు. అందుకే పిల్లలకు ఇచ్చే ఆహారంలో గుడ్డు ఉండేలా చూడటం చాలా అవసరం. గుడ్డులో విటమిన్ ఏ, బి, డి, ఇ పుష్కలంగా ఉంటాయి. దానితో పాటు ఫోలిక్ ఆసిడ్, క్యాల్షియమ్ క్రోమియం, సెలేనియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. గుడ్డు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుందనే అపోహ వద్దు. అప్పుడప్పుడూ గుడ్డు తింటుంటే వేడి చేస్తుందని, కొలెస్ట్రాల్ పెరుగుతుందని భావించడం సరికాదు. అయితే ప్రతిరోజూ రెండు కంటే ఎక్కువగా గుడ్లు తినాల్సి వస్తే మాత్రం అప్పుడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడానికి పచ్చసొనను తీసుకోకుండా ఉంటే చాలు.
గుడ్ల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.