ఆయుర్వేదం థైరాయిడ్‌కు ఒక పరిష్కారం

ఆయుర్వేద పరిభాషలో థైరాయిడ్ గ్లాండుని ‘‘గ్రైవేయగ్రంధి’ అంటారు. ఈ గ్రంధి థైరాక్సిన్ అనే హార్మోనుని విడుదల చేస్తుంది. ఇది ప్రాకృత ధాతు పరిణామాలకు అవసరం. ఈ గ్రంధి తన స్థాయికి మించి తక్కువగా పనిచేసినా, లేక ఎక్కువగా పనిచేసినా అనర్థమే. ఆ లక్షణ సముదాయాన్ని హైపో, హైపర్ థైరాయిడ్ వికారాలుగా గుర్తించారు.

లక్షణాలు: బరువు పెరగటం (మేధోరోగం) ప్రధానంగా ఉంటుంది. గొంతుక యొక్క స్వరంలో బొంగురుతనం రావచ్చు. చెక్కిళ్లలో వాపు, మలబంధం, నాడియొక్క వేగం తగ్గటం, మనిషిలో చురుకుదనం తగ్గటం, బీపీ పెరగటం, మహిళల్లో నెలసరికి సంబంధించిన ఇబ్బందులు, వంధ్యత్వం వంటి ఇతర లక్షణాలు కూడా ఉండొచ్చు. రక్తహీనత కూడా కలుగుతుంది. కొంతమదిలో కంఠం దగ్గర కాయవంటి వాపు కూడా రావొచ్చు; దీన్ని ఆయుర్వేదం ‘గలగండ’గా ప్రస్తావించింది. దీన్నే ‘గాయిటర్’ అంటారు. పోషక పదార్థాలలో ‘అయొడిన్’ తగ్గటం, ఆనువంశికం, ఇతర జన్యుపరమైన కారణాల వల్ల ఇది సంభవిస్తుంది.



చికిత్స: వీలున్నంత వరకు కారణాన్ని సరిదిద్దుకోవటం ప్రధానాంశం. ఆహారంలో అయొడిన్ ప్రధానంగా పోషకాంశాలు తగ్గకుండా చూసుకోవాలి. లక్షణాలను బట్టి ఈ ఔషధాలు వాడటం వల్ల ఫలితం బాగుంటుంది.

విహారం: బరువు తగ్గటం చాలాముఖ్యం. కాబట్టి సరియైన వ్యాయామం (నడక, ఆటలు, యోగాసనాలు వంటివి) తప్పనిసరిగా చేయాలి. సర్వాంగాసన, హలాసనాలు వేయటం వల్ల కంఠం మీద ఒత్తిడి పడి, ఆ గ్రంథి కర్మసామర్థ్యం పెరగటానికి ఉపకరిస్తుంది. ప్రాణాయామం క్రమం తప్పకుండా రోజుకి రెండుపూటలా చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

గమనిక: లక్షణాలను బట్టి మందులు మార్చవలసి ఉంటుంది. కనుక వైద్యుని పర్యవేక్షణ అవసరం.

ఔషధాలు..


కాంచనారగుగ్గులు (మాత్రలు): రోజుకి 2 నుండి 6 మాత్రలు వరకు వాడవచ్చు.

మేదోహర విడంగాదిలోహ (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1.

ఆరోగ్యవర్ధని (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1.

పునర్నవారిష్ట (ద్రావకం)4 చెంచాలు (సమానంగా నీళ్లు కలిపి రెండు పూటలా తాగాలి.

ఇది  అవగాహన కొసం మాత్రమే .
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top