పిల్లలు సరైన ఎత్తు పెరగాలంటే ఏం చేయాలో వైద్య నిపుణులు కొన్ని సూచనలు

పిల్లలు ఎత్తు బాగా పెరగాలంటే పుట్టకతోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిపాలు పిల్లలను ఆరోగ్యంగానూ, చురుగ్గానూ ఎదిగేలా సహాయపడతాయి. బిడ్డకు తొమ్మిది నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
ఆహారంలో ప్రొటీన్లు, ఫ్యాట్, క్యాల్షియం, ఐరన్, బి-విటమిన్, జింక్ సమతూకంలో ఉండేలా జాగ్రత్తపడాలి. తృణధాన్యాలు, పాలు, చేపలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, నట్స్‌లో ఇవన్నీ లభిస్తాయి.
ప్రొటీన్లు, ఫ్యాట్ తర్వాత కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎదగాల్సిన వయసులో ఎత్తు పెరడగానికే కాదు స్రెచ్చింగ్ ఎక్సర్‌సైజుల వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. వ్యాయామాల వల్ల గ్రోత్ హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. వెన్నుముక, పొత్తి కడపు కండరాలు స్ట్రాంగ్ అవుతాయి.
మార్కెట్లో దొరికే బూస్టర్లు తాగిస్తేనే ఎత్తు పెరుగుతారని ఏమీ లేదు. విటమిన్లు, న్యూట్రియంట్లు ఆహారంలో సమతూకంలో ఉండేలా జాగ్రత్తపడితే పిల్లల వయసు పదిహేడేళ్లు వచ్చేవరకు తగినంత ఎత్తు పెరుగుతారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top