పాదరక్షల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...

కాళ్లకు రక్షణ కల్పించేవి పాదరక్షలు. వీటి విషయంలో సాధారణ వ్యక్తులతో పాటు, చక్కెర వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పాదరక్షల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మన కాలివేళ్లు అన్నీ సౌకర్యంగా ఉండేందుకు పాదరక్ష ముందుభాగం తగినంత విశాలంగా ఉండాలి. అక్కడ అవి బిగుసుకుపోయి కిక్కిరిసి ఉండేలా పాదరక్ష ఉండకూడదు మన పాదరక్ష మడమ మరీ ఎక్కువ ఎత్తుగా ఉండకుండా చూసుకోవాలి
 

షూ వాడే వారు పాదరక్ష చర్మంతో ఒరుసుకుపోకుండా సౌకర్యంగా లేసులు బిగించాలి. అయితే మరీ రక్తసరఫరా ఆగేంత బిగుతుగా కూడా బిగించకూడదు మీరు కొత్త షూ కొన్న తర్వాత వాటిని వాడే సమయంలో కొంతకాలం పాత సాక్స్‌ను ఉపయోగించండి మీరు పాదరక్షలోకి పాదాన్ని ఉంచాక దానికి ఏవైనా రాళ్ల వంటివి తగులుతున్నాయేమో అని స్పర్శతో పరిశీలించండి. అలాంటిది ఏదైనా ఉండి అసౌకర్యంగా ఉంటే మొదట దాన్ని తొలగించాక మళ్లీ ధరించండి. అంతేగాని నొప్పిని అదేపనిగా భరిస్తూ ఉండవద్దు పాదరక్షలు లేకుండా ఎండగా ఉన్నప్పుడు కాళ్లు కాలేచోట తిరగకండి. వాహనంలో ప్రయాణాలు చేసేవారికి వాళ్ల కాళ్ల కింద ఉన్న ఫ్లోర్ వేడిగా ఉంటే పాదరక్ష తొడుక్కునే ఉండండి. ప్రయాణ సమయంలో పాదరక్షలు విడిచి ఉండకండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top