సన్‌స్క్రీన్ లోషన్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పక చదవాల్సిందే.

సన్‌స్క్రీన్ లోషన్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పక చదవాల్సిందే. ఎందుకంటే వీటి తయారీకి వాడే బెంజోఫినోన్ అనే రసాయనం వల్ల స్త్రీలకు ఎండోమెట్రియాసిస్ సమస్య తలెత్తుతున్నదని హెచ్చరిస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. గర్భాశయం బయట కూడా త్వచం పెరిగి విపరీతమైన నొప్పి కలిగే పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

సన్‌స్క్రీన్ లోషన్ ఒకటే కాకుండా బెంజోఫినోన్‌తో తయారయ్యే కాస్మొటిక్ ఉత్పత్తులు ఏవి ఉపయోగించినా ఈ ప్రమాదం తప్పదని తేల్చేశారు శాస్త్రవేత్తలు. మెదడు, నాడీవ్యవస్థ, హార్మోన్ సమస్యలు, అలర్జీలు కూడా వస్తాయని లాబొరేటరీ పరిశోధనల్లో వెల్లడయ్యింది. మరెలా అని బాధపడనక్కర్లేదు. మార్కెట్లో ఏ రసాయనాలూ ఉపయోగించకుండా తయారయిన ఉత్పత్తులు దొరుకుతున్నాయి. వాటిని వాడితే ఏ ఇబ్బందీ ఉండదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top