గ్లామరస్‌గా కన్పించాలంటే...

పనిచేస్తున్నప్పుడు గానీ, ఇంట్లో విశ్రాంతి తీసుకుం టున్నప్పుడు గానీ గంటకోసారి చన్నీళ్ళు లేదా గోరువెచ్చని నీటిని మొహంమీద చిలకరించుకుంటుం డటం మంచిది. బట్టలుతికే సమయాల్లో స్ర్తీలు చేతులకు రబ్బర్‌ గ్లోవ్స్‌ ధరించడం మంచిది. కాళ్ళని, పాదాలని తరచూ నీటిలో తడుపుతుండటం మంచిది కాదు. తడిసిన భాగాలని ఎప్పటికప్పుడు పొడి టవల్‌ తో తుడుచుకుంటూ ఉండాలి.


అప్పుడప్పుడూ చేతులకూ, పాదాలకు మాయిశ్తరెైజ్డ్‌ లోషనుగానీ, బేబీ లోషన్‌గానీ పట్టిస్తుండాలి. వంటిం ట్లో అలసిపోయిన స్ర్తీలు వెంటనే విశ్రాంతి తీసుకుం టూ కనురెప్పలపెై దోసకాయ చక్రాలని కాసేపు వుంచు కోవడం మంచిది. దీనివలన కళ్ళు మంటలు తగ్గు తా యి. స్ర్తీలు ఇంట్లో శ్రమించినా ప్రతిరోజూ ఉద యం, సాయంత్రం పూట తేలిక వ్యాయామం చేయడం చాలా అవసరం.


జాగింగ్‌, వాకింగ్‌, సిటప్స్‌. స్టమక్‌ ఎక్సర్‌సైజ్‌లు, షోల్డ ర్‌ ఎక్సర్‌సైజ్‌లు, బాక్‌బోన్‌ నెక్‌ ఎక్సర్‌సైజులు స్ర్తీలు గాఢంగా ఊపిరి పీల్చుతూ, మెల్లగా వదులుతూ చే యాలి. ప్రతిరోజూ కాసేపు నిర్మలంగా కూర్చుని ధ్యానం చేయడం కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top