కీళ్లమార్పిడి శస్త్రచికిత్స అపోహలు- వాస్తవాలు

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో కాల్షియం లోపం వల్ల మోకాళ్ల సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆధునిక కీళ్లమార్పిడి శస్త్రచికిత్స విధానాలు ఎన్నదగిన ఫలితాలను అందిస్తున్నాయి. అయితే చాలామంది కొన్ని అపోహల కారణంగా ఈ చికిత్స చేయించుకోవటానికి సంశయిస్తున్నారు. అయితే ఆ అపోహల గురించిన వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


అపోహ : మోకాలు మరియు తుంటి ఎముకల నొప్పి వృద్ధాప్యంలో సహజంగా వచ్చే మార్పులే కనుక చికిత్స అవసరం లేదు.

వాస్తవం : దినచర్యకు ఆటంకం లేకుండా జీవించటానికి సహాయపడే ఈ శస్త్రచికిత్సను ఏ వయసు వారు అయినా చేయించుకొని చక్కని ఉపశమనం పొందవచ్చు.

అపోహ : శస్త్రచికిత్స తర్వాత కీళ్లు తన సహజత్వాన్ని కోల్పోతాయి.

వాస్తవం : శాస్త్రీయంగా చేసిన అనేక రకాల కృత్రిమ కీళ్లు సహజమైన మోకాళ్లు, తుంటి ఎముకల లాగే పనిచేస్తాయి.

అపోహ : చిన్న వయసులో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోకూడదు.



వాస్తవం : వయసును బట్టి కాకుండా రోగి ఇబ్బందిని బట్టి సర్జరీ చేయాలి. చిన్న వయసులోనే తీవ్రమైన కీళ్లనొప్పులతో బాధపడే వారికి సర్జరీ ఒక చక్కని పరిష్కారం. ఎందుకంటే చిన్న వయసు వారు త్వరగా కోలుకొని మెరుగైన జీవనశైలిని పొందుతారు. ఆలస్యం చేసే కొలది కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది.

అపోహ : చికిత్సలో భాగంగా మోకాలు లేదా తుంటి ఎముకను పూర్తిగా తొలగిస్తారు.

వాస్తవం : కీళ్ల మధ్యలో అరిగిపోయిన గుజ్జు స్థానంలో కృత్రిమమైన క్యాప్‌ను అమరుస్తారు. అంతేకాని ఎముకని తొలగించరు.

:
అపోహ  కీళ్ల మార్పిడి యొక్క ఫలితాలు తాత్కాలికమే.

వాస్తవం : 90 శాతం మందిలో కీళ్ల మార్పిడి అనంతరం 15నుంచి20 సంవత్సరాల వరకు ఏ రకమైన ఇబ్బందులు తలెత్తటం లేదు.



అపోహ : నడవటానికి ఆరు నెలలకు పైగా సమయం పడుతుంది.

వాస్తవం : శస్త్రచికిత్స చేసిన రెండు రోజులకే అడుగులు వేయటం మొదలు పెట్టవచ్చు. వారం రోజుల్లో ఇంట్లో వాకర్ సహాయంతో నడవవచ్చు. మామూలుగా నడవటానికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది.

అపోహ: కీలు మార్పిడి ఆపరేషన్ తర్వాత మునుపటిలా నడవగలనా?

వాస్తవం : ఆధునిక కీలు మార్పిడి శస్త్రచికిత్స వల్ల మునుపటిలా ఎలాంటి ఆటంకం లేకుండా సహజంగా నడవగలుగుతారు.

అపోహ : కీలు మార్పిడి ఆపరేషన్ వల్ల వికలాంగుడిని అవుతానా?

వాస్తవం : ఇది కేవలం అపోహ మాత్రమే. ఆధునిక వైద్యపద్ధతుల్లో శస్త్రచికిత్స చేస్తే ఎలాంటి నొప్పి లేకుండా నడవవచ్చు.

అపోహ : ఈ ఆపరేషన్‌తో మోకాలికి చీము పడుతుందా? ఏమైనా కాలికి ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశముందా?



వాస్తవం : అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్‌లో,సరైన పద్ధతిలో అనుభవజ్ఞులైన, నిపుణులైన వైద్యులు ఆపరేషన్ చేస్తే కాలికి చీము పట్టదు. ఈ ఆపరేషన్‌లో ఇన్‌ఫెక్షన్‌లు చాలా అరుదు. తక్కువ ధరల్లో సులభమైన ప్రక్రియలో నిర్వహిస్తున్న మోకాలు, తుంటి ఎముకల మార్పిడి శస్త్రచికిత్స ఎలాంటి అపోహలకు, సంశయాలకు తావివ్వకుండా చేయించుకొని మెరుగైన జీవన శైలిని పొందవచ్చు.


కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో అధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. మోకాళ్లలో అరిగిపోయిన కీళ్ల భాగంలో అమర్చే ఇంప్లాంట్స్‌లో కొత్తవి వచ్చాయి. అధునాతన మైన ఇంప్లాంట్స్‌ను అరిగిన కీళ్ల స్థానంలో అమర్చడం ద్వారా మునుపటి మోకాలు సహజత్వాన్ని తీసుకురావచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top