వయసుతోపాటు వచ్చే గుండె జబ్బులు-ఎందుకు వస్తాయి? ఎవరికి వస్తాయి?

మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ గుండె జబ్బుల శాతం రోజురోజుకూ అంచనాలను మించి పెరుగుతూనే ఉంది. ఈ జబ్బులు పుట్టుకతోనూ, కౌమార, యవ్వన దశల్లోనూ, ఇంకా వయస్సు మీద పడుతున్న వారిలోనూ వస్తూనే ఉన్నాయి. అయితే పుట్టుకతో వచ్చేవి, తరువాత దశల్లో అవి ఇంకా పెరి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈనాడు యుక్త వయస్కులు వారు చేసే ఉద్యోగ, జీవన విధానాలు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి వాటి వల్ల తరచుగా ఈ గుండెజబ్బులకు గురవుతున్నారు. 

వయస్సు పెరిగే కొద్దీ శరీరంలోని ధమనులలోనూ, గుండెలోనూ అనేక మార్పులు సంభవిస్తాయి. ఇటీవల వరకూ ఈ మార్పులు వయస్సు పెరగడం వల్లనే సంభవిస్తున్నాయని భావించేవారు. అయితే ప్రస్తుతం లభిస్తున్న గణాంకాల ప్రకారం ఈ మార్పులు జీవన విధానం వల్ల కరొనరీ ధమనుల్లో పేరుకున్న పీచు, కొవ్వు పదార్థాల మిశ్రమం అని నిర్ధారిస్తున్నారు. ఈ కరొనరీ ధమనులు గుండెకు పోషకాలను ఆక్సిజన్ ద్వారా అందచేస్తాయి. వీటి ప్రసరణకు అడ్డంకి ఏర్పడితే గుండె పని తీరు సహజత్వాన్ని కోల్పోయి గుండె కండరానికి రుగ్మత ఏర్పడుతుంది.



ఎందుకు వస్తాయి?
శరీరంలో రక్త పీడనం అంటే బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థితిని దాటినపుడు గుండెజబ్బులు వస్తాయి. ఈ రీడింగ్ 130/80 ఎంఎంహెచ్‌జిగా ఉండాలి. శరీరంలో మిలియన్ల కొద్దీ జీవకణాల్లో ప్రతి ఒక్క కణానికి పోషణ నిమిత్తం రక్త ప్రసరణ జరగడానికి తగినంత ఒత్తిడి అవసరం. ఈ ఒత్తిడినే బిపిగా కొలుస్తారు. పెద్దలలో సాధారణంగా రక్తప్రసరణం 140/90 కంటే ఎక్కువ ఉండకూడదు. తీవ్రంగా వ్యాయామం చేసినప్పుడు, ఉద్రిక్త దశలోనూ పీడనం పెరుగుతుంది.

వైద్య పరీక్షలు
అత్యవసర పరిస్థితులలో వైద్యులు కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు జరపవలసి ఉంటుంది. లిపిడ్స్ శాతం పరీక్షించినప్పుడు ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువగా ల్రైగ్లిజరేట్లు, ఇతర కొవ్వు పదార్థాలు ఎక్కువయితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మగవారిలో ముఖ్యంగా హెచ్‌డిఎల్ అనే మంచి కొలస్ట్రాల్ తక్కువగా ఉండటం గమనార్హం. ఈ కొవ్వు పదార్థాలు వయస్సుతోపాటు పెరిగి రక్త ప్రసరణ సాఫీగా జరగకుండా ఆటంకపరుస్తాయి. బాల్యం నుంచే పేరుకునే ఈ కొవ్వు ప్రక్రియనే అథ్రెస్కెల్‌రోసిస్ అంటారు. దీని ఫలితంగా ధమనులు వ్యాకోచించకుండా గట్టిగా అయి కఠినంగా మారుతాయి. ధమని అంతర వ్యాసం తగ్గిపోయి గుండె శరీరంలోని చివరి భాగానికి రక్త సరఫరా జరగదు. గుండె కండరం సాధారణ స్థాయి కంటే ఎక్కువ శ్రమపడవలసి వస్తుంది. దీని వల్ల గుండెకు అలసట కలిగి గుండెనొప్పి ప్రారంభమవుతుంది.

ఎవరికి వస్తాయి?
వయస్సు పెరిగి రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిలో గుండెజబ్బు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చాలామందికి వయస్సు మీదపడిన తరువాత డయాబెటిస్ వస్తుంది. స్థూలకాయం, వారసత్వం, వయోభారం, కుటుంబ చరిత్రలో గుండెజబ్బులు, అధిక రక్తపోటు వంటివి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. నిద్ర మాత్రలకు అలవాటుపడిన స్త్రీలలోనూ, వయసుతో కొంతమార్పు వచ్చిన, జీవన శైలి వల్లనూ, ధూమపానం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఆందోళన, ఒత్తిడి రెండు ప్రధాన కారణాలు. ఇవి ఎక్కువకాలం ఉంటే ఇతర జబ్బులతో గుండెజబ్బులు కూడా వస్తాయి.


జాగ్రత్తలు
మనం వయస్సు పెరుగుతున్న కొద్దీ అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఫిజిషియన్‌ను లేదా కార్డియాలజిస్టును సంప్రదించాలి. బాల్యంలోనూ, పాఠశాలలోనూ గుండె జబ్బుల నిరోధానికి కృషి చేయాలి. అలా చేస్తే హృద్రోగం దరి చేరదు. దానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు పాటించాలి. అవి ఆహార నియమాలు, మితమైన ఆల్కహాల్, ధూమపానం మానడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి. బిపి, డయాబెటిస్‌లను అదుపులో ఉంచుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top