పిల్లలు ఎత్తు పెరగకపోతే...?

సాధారణంగా మనిషి ఉండాల్సిన దానికంటే తక్కువ ఎత్తు పెరగడాన్ని పొట్టిగా ఉండటంగా అభివర్ణిస్తారు. ఈ సమస్య పిల్లలను, యుక్తవయసులో ఉన్నవారిని ఎక్కువగా బాధిస్తుంది. సాధారణంగా పొట్టిగా ఉండే ఉన్న తల్లిదండ్రుల పిల్లలు కూడా పొట్టిగానే ఉంటారు. కొన్నిసార్లు పొట్టిగా ఉండటం ఒక వ్యాధి లక్షణం అవుతుంది.

ఎత్తు తక్కువగా ఉండటానికి కారణాలు: అఖాండ్రోప్లేసియా దీర్ఘకాలిక వ్యాధులు (పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు, మూత్రపిండాలవ్యాధులు, ఆస్తమా, సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు, మధుమేహం వంటివి) పెరుగుదల నెమ్మదిగా ఉండటం కుషింగ్ డిసీజ్ డౌన్స్ సిండ్రోమ్ హైపోథైరాయిడ్ పుట్టుకకు ముందునుంచే ఉండటం పేగువాపు పేగులో పుండ్లు పౌష్టికాహార లోపం నూనాన్ సిండ్రోమ్ పెరుగుదల హార్మోన్ తగ్గడం రికెట్స్ టర్నర్స్ సిండ్రోమ్ విలియమ్స్ సిండ్రోమ్... వంటివి. 

తీసుకోవలసిన జాగ్రత్తలు: పొట్టిగా ఉండటం అన్నది తల్లిదండ్రుల నుంచి సంక్రమించినట్లయితే, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా వ్యాధితో ఎత్తు పెరగకపోతే దానికి మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మిగతా పిల్లలతో పోలిస్తే తమ పిల్లలు పొట్టిగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యులు పరిశీలించి పిల్లల ఎత్తు, బరువు, కాళ్లుచేతుల కొలత తీసుకుని, ఒకవేళ ఏదైనా వ్యాధి కారణంగా పిల్లల్లో పెరుగుదల లేదని అనుమానిస్తే దానికి సంబంధించిన పరీక్షలు, ఎక్స్-రే వంటివి సూచిస్తారు.

కుటుంబ చరిత్ర: తల్లిదండ్రులు, తాత, సోదరులు, బంధువులు... అందరి ఎత్తును పరిగణనలోకి తీసుకుని, వీరిలో ఎవరైనా ఏదైనా వ్యాధి కారణంగా పొట్టిగా ఉన్నారా అని కూడా పరీక్షిస్తారు.

పిల్లల చరిత్ర: పిల్లలు పుట్టిన సమయం, ఆహార నియమావళి, యుక్తవయసుకు సంబంధించిన లక్షణాలు ఏ వయసులో మొదలయ్యాయి వంటివాటితో పాటు ఇతరలక్షణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకుంటారు. అమ్మాయిలు పొట్టిగా ఉంటే కారియోటైప్ పరీక్ష చేయాలి. దీని ద్వారా జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారేమో తెలుసుకుంటారు.



ఇతర పరీక్షలు: సీబీపీ (రక్త పరీక్ష ) ఎలక్ట్రోలైట్ పాళ్లు వైద్యులు నమోదు చేసే ఎత్తు, బరువు వివరాలను పరిగణనలోకి తీసుకుని తేడా ఉన్నప్పుడు దాన్ని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి.

మందులు: ఎత్తు పెరగడం కోసం హోమియోలో కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇలా జరుగుతోందా అనే విషయంతో పాటు, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ లోపాల వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు సూచించాల్సి ఉంటుంది. బెరైట్ గ్రూప్ ఔషధాలైన కాల్కేరియా కార్బ్, బెరైటా కార్బ్, మెడోరినమ్, తూజా వంటి మందులను తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top