స్వీట్‌కార్న్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. కాని అందానికి కూడా స్వీట్‌కార్న్ బాగా ఉపయోగపడుతుందని తెలుసా మీకు?

స్వీట్‌కార్న్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. కాని అందానికి కూడా స్వీట్‌కార్న్ బాగా ఉపయోగపడుతుందని తెలుసా మీకు? రోజూ గుప్పెడు మొక్కజొన్న గింజలు తినడంతో పాటు వాటితో తయారుచేసే నూనెను చర్మసౌందర్యం కోసం వాడితే బోలెడు ప్రయోజనాలుంటాయంటున్నారు బ్యుటీషియన్లు.

- స్వీట్‌కార్న్ గింజల నూనెను రోజూ ఉదయంపూట కాళ్లకు చేతులకు రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల చర్మం మెత్తబడుతుంది. మృతచర్మం, మచ్చలు వంటివి పోతాయి. ఈ నూనెలో ఉండే లినోలె యాసిడ్ చర్మంపై వచ్చే దురదలను, మంటలను తగ్గిస్తుంది.

- తాజాగా స్వీట్‌కార్న్ గింజల్ని మెత్తగా రుబ్బుకుని అందులో ఒక స్పూను ఫేస్‌ప్యాక్ పొడిని కలిపి మొహానికి పూసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

- స్వీట్‌కార్న్‌లో ఉండే ఫోలిక్‌యాసిడ్ రక్తంలోని ఎర్రరక్త కణాలను తగ్గకుండా చూస్తుంది. స్వీట్‌కార్న్ తినడం వల్ల మనలోని కొలస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

- మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top