డిగ్రీ పూర్తయ్యింది...ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి అనుకుంటున్నారా? అయితే ఒక్కక్షణం ఆగండి.

డిగ్రీ పూర్తయ్యింది...ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి అనుకుంటున్నారా? అయితే ఒక్కక్షణం ఆగండి. ఇది పోటీ యుగం. అన్ని రంగాలలో పోటీ ఉన్నట్లే ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. సర్కారీ కొలువైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా ఒక ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడే రోజులివి. ప్రభుత్వ ఉద్యోగానికి ఎలా పోటీ పరీక్షలుంటాయో ప్రైవేట్ కంపెనీలు కూడా రిటన్ టెస్టులు, ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాతే ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించదలచుకున్నవారు ఈ కొన్ని సూచనలు పాటిస్తే విజయం సాధించడానికి మార్గం సులువవుతుంది.

మీరు పూర్తిచేసిన డిగ్రీ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్‌తోపాటు మీరు కాలేజ్‌లో సాధించిన ఇతర మెరిట్ సర్టిఫికెట్లను కూడా ఇంటర్వ్యూకు వెంట తీసుకెళ్లండి. మీ ప్రొఫైల్‌లో మీకు ఏ విషయాలపై ఆసక్తి ఉందో తెలియచేయండి.

ఏ జాబ్ ట్రయల్‌కైనా ప్రిపరేషన్ అన్నది ముఖ్యం. మీరు ఏ జాబ్ కోసమైతే వెళుతున్నారో అందుకు సంబంధించిన కనీస అవగాహన ఉండడం అవసరం. అలాగే మీరు ఇంటర్వ్యూ కెళుతున్న కంపెనీ గురించి, దాని కార్యకలాపాల గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.



కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు. లోకజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి. చాలామంది టెక్ట్స్‌బుక్ నాలెడ్జ్‌కే పరిమితమైపోతారు. ప్రపంచంలో ఏమి జరుగుతోందో తమకేమి అవసరం లేనట్లు ఉంటారు. అలా ఉండడం వల్ల జనరల్ నాలెడ్జ్‌లో పూర్‌గా మిగిలిపోతారు. అందుకని ఎప్పటికప్పుడు జికెలో అప్ టు డేట్‌గా ఉండడం అవసరం. ఇందుకోసం రెగ్యులర్‌గా వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, హూ ఈజ్ హూ బుక్స్ చదవాలి.

అదే విధంగా ఇంటర్వ్యూలకు వెళుతున్నపుడు క్యాజువల్ డ్రెసప్ పనికిరాదు. మీరు వెళుతున్నది ఏ ఉద్యోగం కోసమైనా కంపల్సరీ ఫార్మల్స్ ధరించాలి. టీషర్ట్, జీన్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. నీట్‌గా డ్రెసప్ అయి హుందాగా కనపడేవారికే ఏ కంపెనీ అయినా ప్రిఫరెన్స్ ఇస్తుంది.


పర్సనల్ ఇంటర్వ్యూల సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండండి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తుల నుంచి వచ్చే ఒక్కో ప్రశ్నకు నిదానంగా, సూటిగా, తడుముకోకుండా సమాధానమివ్వండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేయండి కాని అరకొర జ్ఞానాన్ని మాత్రం వాళ్ల ముందు ప్రదర్శించకండి.

ఠిఇంటర్వ్యూ చేసే వ్యక్తుల ముందు అతివినయం ప్రదర్శించకండి. దాన్ని ఏ సంస్థ ఇష్టపడదు. అలాగే అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమివ్వండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని అంతా ప్రదర్శించడానికి ఉత్సాహపడకండి. వారు చిరాకుపడే అవకాశంముంది. సూటిగా, క్లుప్తంగా సమాధానమిస్తే చాలు.



ఇప్పుడు చాలావరకు కంపెనీలు ఇంటర్వ్యూ కొచ్చిన వాళ్లకు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తున్నాయి. ఇందులో లేవనెత్తే ఒక్కో సబ్జెక్ట్ గురించి అందరూ తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎవరు బాగా తమ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారో వారికే ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్ గురించి ముందుగానే ఒక అవగాహనకు రావడం అవసరం. ఇతరుల ముందు ఉపన్యాసం ఇవ్వాలంటే బిడియపడే వారూ ఉంటారు. అలాంటి వారు ముందుగా తమ కుటుంబ సభ్యులు, మిత్రుల ముందు అనర్ఘళంగా మాట్లాడేందుకు ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు మున్ముందు చాలా ఉపయోగపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top