కన్యాకుమారి పర్యాటక క్షేత్రానికి ఎలా వెళ్లాలి? అక్కడ చూడాల్సిన విశేషాలేమిటి?

మనదేశంలోని సుప్రసిద్ధ పర్యాటకక్షేత్రాల్లో కన్యాకుమారి అగ్రగణ్యమైంది. ఇది చెన్నై నగరానికి ఏడువందల కిలోమీటర్ల దూరాన ఉంది. తిరువనంతపురం నుంచి 90 కి.మీ. ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన కన్యాకుమారి చేరుకోవచ్చు. అరేబియా, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం కలిసే ప్రదేశం ఇది. సూర్యోదయం, సూర్యాస్తమయ ప్రతిబింబాలను సముద్రం నీటిలో చూడవచ్చు.

పౌర్ణమి నాడు అస్తమిస్తున్న సూర్యుణ్ని, ఉదయిస్తున్న చంద్రుణ్ని ఏకకాలంలో చూడవచ్చు. ఈ అద్భుతాన్ని చూడాలంటే పౌర్ణమి రోజు కన్యాకుమారిలో ఉండేటట్లు యాత్రాప్రణాళిక వేసుకోవాలి. ఇక్కడ సముద్రపు ఒడ్డున కన్యాకుమారి ఆలయం ఉంది. దీనికి చేరువలో సముద్రంలోపల వివేకానంద మెమోరియల్ ఉంది. అక్కడికి వెళ్లడానికి మరపడవలు ఉంటాయి, వివేకానందుడు ధ్యానం చేసిన స్థలం ఇది. 


కన్యకమాత ఆలయానికి సమీపంలో గాంధీ మెమోరియల్ ఉంది. మహాత్మాగాంధీ చితాభస్మాన్ని త్రివేణి సంగమంలో కలపడానికి ముందు ప్రజల సందర్శనార్థం ఉంచిన ప్రదేశంలో స్మారక చిహ్నాన్ని కట్టారు.

చితాభస్మాన్ని ఉంచిన ప్రదేశంలో ఏటా అక్టోబరు రెండవ తేదీన సూర్యకిరణాలు పడతాయి. వివేకానంద రాక్ మెమోరియల్‌కు సమీపంలో తిరువళ్లువార్ విగ్రహం ఉంది. దీనిని చూసి తీరాల్సిందే. ఇటు ఆధ్యాత్మిక యాత్రికులను, ఆహ్లాదభరితమైన పర్యటనను కోరే పర్యాటకులను అలరించే ప్రదేశం కన్యాకుమారి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top