గాలితో ఫేషియల్ మీరు ఎప్పుడైనా విన్నారా ? అయితే ఇది చదవండి .

ఫేషియల్స్ ఎన్ని రకాలని ఏ కాలేజి అమ్మాయినడిగినా చెప్పేస్తుంది. ఫేషియల్ అనగానే క్లీనప్, స్క్రబ్బింగ్, మసాజ్, స్టీమింగ్, ప్యాక్...అంటూ గంట పని ఉంటుంది. వీటితో పనిలేకుండా గాలితో చేసే ఫెషియల్ అందుబాటులోకి వచ్చేసింది. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గాలిని చర్మంలోకి పంపితే చాలు...మిలమిల మెరిసే చర్మం మీ సొంతమవుతుందని చెపుతున్నారు బ్యూటీషియన్లు. పాపులర్ సింగర్ మడోన మొదలుకొని కేట్ మిడిల్టన్ వరకూ ఆక్సిజన్ ఫేషియల్‌నే ఇష్టపడుతున్నారట. ఇంతకీ గాలి ఫేషియల్‌లో ఏం చేస్తారు.

ముందుగా మీ చర్మాన్ని పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి గ్లూకోజ్, మెగ్నీషియం, పొటాషియం కలిపిన గన్‌తో మొహంపై స్ప్రే చేస్తారు. తరువాత మొహంపైకి గాలి వెళ్లకుండా హెల్మెట్‌లాంటి మాస్క్ పెట్టేస్తారు. ఓ అరగంట తర్వాత మాస్క్ తీసేస్తారు. అంతే ఆక్సిజన్ ఫేషియల్ పూర్తయిపోయినట్టే. దీని వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు పోయి తేమగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. 


గంటలకొలది మసాజ్‌లు, రకరకాల క్రీముల పూతలు, ఫేస్‌ప్యాక్‌ల బాధల్లేకుండా ఎంచక్కా ఓ అరగంట ఆక్సిజన్ ఫేషియల్ పెట్టించుకుంటే హాయిగా ఉంటుంది నాకు. పైగా నా మొహం కూడా ఈ ఫేషియల్ తర్వాత మెరిసిపోతుంది''. "దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల చర్మం కోల్పోతున్న తేమను తిరిగి తెచ్చిపెట్టేదే ఆక్సిజన్ ఫేషియల్. పదిహేనేళ్లు పైపడ్డ ప్రతిఒక్కరూ ఈ ఫేషియల్ చేయించుకోవచ్చు'' అని బ్యూటి ఎక్స్‌పర్ట్ మంజూ రావత్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top