ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం కావాలంటే.....

ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం కావాలంటే జుట్టుకి మందారపువ్వుని వాడాలి. ఎలాగంటే...

- దుమ్ము, ధూళితో ఉన్న జుట్టుకోసం ఆరు మందారపువ్వుల్ని గుజ్జుగా చేసి అందులో ఒక స్పూను కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

- ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఒక గ్లాసు నీళ్లలో రెండు టీ స్పూన్ల టీ పొడి వేసి మరిగించి అందులో ఒక టేబుల్ స్పూను మందారపొడి వేసి కలిపి తలకు పట్టించాలి. జుట్టుకి ఇది మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.

- వెంట్రుకలు చిట్లిపోకుండా ఉండాలంటే ఒక కప్పు పుల్లటి పెరుగులో రెండు టీ స్పూన్ల మందారపొడి వేసి బాగా కలిపి జట్టుకి పట్టించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top