వారం రోజుల దోబూచులాట తరువాత ఎట్టకేలకు వర్షాలు వచ్చేశాయి. తొలకరి చినుకుల్లో చిన్నాపెద్దా చిందులేయడం సహజమే. అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే అనారోగ్యం బారినపడటం జరుగుతుంది. జలుబు, ఫ్లూ, వైరల్‌ఫీవర్ వంటి జబ్బులు ఈ సీజన్‌లో వచ్చిపడుతుంటాయి. వర్షాకాలంలో జెర్మ్స్, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం, పరిసరాలు తడిగా ఉండటం మూలంగా సమస్యలు పెరుగుతాయి. ఆహారం విషయంలో శ్రద్ధ వహించకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి.
- ఇంట్లో తయారుచేసింది కాకుండా బయటి ఆహారాన్ని సాధ్యమైనంతవరకు తినకూడదు. ఈ సీజన్‌లో పానీపూరీ, మిర్చి, బజ్జీ, పకోడి, సాండ్‌విచ్ వంటి ఆహారపదార్థాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది అజీర్ణంకు కారణమవుతుంది.
- తాజా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పోషకాలు ఎక్కువగా అందితే ఈ సీజన్‌లో ఫిట్‌గా ఉండటానికి ఉపకరిస్తుంది. కూరగాయలను వండేముందు వేడినీళ్లలో, ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా కడిగిన తరువాత వండుకోవాలి.
- వర్షంలో తడిసినట్లయితే ఇంటికి చేరుకున్న వెంటనే వేడి నీటితో స్నానం చేయండి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే స్నానం తప్పనిసరి.
- ఈ సీజన్‌లో సాధ్యమైనంతవరకు చేపలు, రొయ్యల తినకుండా ఉండటం మేలు. వర్షాకాలంలో చేపలు పునరుత్పత్తి జరుపుతాయి. ఈ సమయంలో వాటిని తింటే స్టమక్ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ తినాల్సి వచ్చినా తాజా చేపలను ఎంచుకోవడం మేలు.
- వర్షాలు ప్రారంభకాగానే నీరు తాగడం తగ్గిపోతుంది. కానీ వీలైనంతవరకు ఎక్కువనీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ సీజన్‌లో కాచి వడపోసిన నీరు తాగడం మేలు. దీనివల్ల వ్యాధుల బారినుంచి రక్షించుకోవచ్చు.
- ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. లీకేజీలు ఉంటే అరికట్టాలి. పగిలిన డ్రైనేజీలు ఉంటే బాగు చేయించాలి. నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. పాతటైర్లు, ఇతర పాత సామాను ఉంటే తొలగించి శుభ్రం చేసుకోవాలి. దోమలు వృద్ధి చెందడానికి ఇవి కారణమవుతాయి.
- ఫిట్‌గా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. వాకింగ్‌కు బయటకు వెళ్లలేకపోయినా ఇంట్లోనే పూర్తి చేయాలి.
- దానిమ్మ, క్యారెట్, ముల్లంగి, మెంతి వంటి వాటిని మెనూలో ఉండేలా చూసుకోవాలి.
- జలుబు, దగ్గు ఉంటే అల్లం వేసి మరిగించిన నీటిని తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే వేడి నీటిలో కాస్త ఉప్పు వేసి పుక్కిలించాలి. వైరల్ ఫీవర్ ఉన్నట్లయితే తులసి, అల్లం, తేనే కలిపి చేసిన జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.