గ్రీన్‌టీని ప్రత్యేకంగా కెమెల్లియా సినెన్సిస్ అనే ఆకులతో తయారుచేస్తారు. చాలా తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలో ఈ ఆకును పొడిరూపంలోకి మారుస్తారు. చైనాలో పుట్టిన గ్రీన్ టీ ప్రస్తుతం ఆసియా ఖండంలో విరివిగా తయారవుతోంది. బ్లాక్‌టీని ప్రేమించే పశ్చిమ దేశాల ప్రజలు కూడా ఇప్పుడు గ్రీన్‌టీపై మోజు చూపిస్తున్నారు. గ్రీన్‌టీలో లభించే పోలిఫెనాల్స్, కెఫీన్ అనే పదార్థాలు శరీరంలో కొవ్వును నియంత్రణలో ఉంచుతాయని, గ్రీన్‌టీ త్రాగేవారిలో హృద్రోగాలు, కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశం తక్కువని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

