చిరుజల్లుల్లోనూ హాయిగా...

ఆస్వాదించే మనసుకు వర్షరుతువు ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉంటుంది. కాకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే, ఇదే సమయంలో కొన్ని కష్టాలూ, చిక్కులూ ఎదురవుతాయి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లతో పాటు నీటి ద్వారా సంక్రమించే, కామెర్లు, డయేరియా అనేక సమస్యలు ఈ కాలం చుట్టుముడతాయి. అందుకే వర్షానికి ఆనందిస్తూనే, వర్షంతో పాటే వచ్చే వ్యాధుల నియంత్రణకు, దోమలు స్థావరం ఏర్పరుచుకోకుండా, కొన్ని చర్యలు చేపట్టడం చాలా అవసరం. ఇంతకూ ఆ చర్యలు ఏమిటంటారా?


ఆహారంలో.....
వర్షాకాలంలో పండ్లూ, కూరగాయలు తాజాగానే క నపడతాయి కానీ, వాటి మీద బాగా మట్టి, ఇతర కలుషితాలు పేరుకుపోయి ఉంటాయి. ప్రత్యేకంగా శుభ్ర్ర పరిచిగాని వాటిని తినకూడదు. ట్యాప్ వాటర్‌ను నేరుగా అలాగే తాగేయడం మరీ ప్రమాదం. కాచి వడబోసి తాగడం ద్వారా, నీటిద్వారా సంక్రమించే ఎన్నో ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సాధ్యమైనంత మేరకు వర్షంలో తడవకుండా జాగ్రత్త పడితే మంచిది. పైగా, జలుబు, దగ్గు, తుమ్ముల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండిపోకూడదు. రసాయనాలు మరీ ఎక్కువగా ఉండే సబ్బులు వాడితే చర్మం ఎండిపోతుంది.చర్మ రక్షణ కోసం, ఈ కాలమంతా, సన్‌స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. మేకప్ పదార్థాలను ఈ కాలంలో ఎక్కువగా వాడటం వల్ల ముఖం మీద మచ్చలు లేదా మొటిమలు ఏర్పడే ప్రమాదం ఉంది. డిటర్జంట్ లేని క్లీన్సర్‌లను వినియోగించడం వల్ల ఈ కాలంలో చర్మం పొడిగా, గరుకుగా మారకుండా ఉంటుంది. వీటికి తోడు, నిద్రపోవడానికి ముందు, ముఖం మీద ఐస్‌ప్యాక్‌లు ఉంచడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది.

పాదాలను పొడిగా...
బురదలో నడవడం వల్ల వర్షాకాలంలో పాదాలు పగుళ్లుబారే ప్రమాదం ఉంది. అందుకే రెయిన్ ప్రూఫ్ ష్యూ వేసుకోవడం ఎంతో మేలు. వర్షాకాలంలో ఒక జత స్యాండల్స్ ఉండటం కూడా ఎంతో మేలు. ఇంకా నేల పూర్తిగా గట్టిపడని సమయంలో వేసుకోవడానికి ఇవి అనుగుణంగా ఉంటాయి. ఇవన్నీ వర్షాకాలంలో పాదాలపరిరక్షణకు బాగా తోడ్పడతాయి.



జుత్తు రక్షణలో...
తలకు తైల మర్ధన చేసుకోవడం ఈ కాలంలో మరీ అవసరం. ఇలా చేయడం వల్ల తలకు ర క్తప్రసరణ పెరగడంతో పాటు, చుండ్రు బారిన పడకుండా కాపాడుకోవచ్చు.కేశ రక్షణలో మనం వాడే దువ్వెన పాత్ర కూడా చాలా కీలకం. తైల మర్థనం వల్ల కేశాలు మృదువుగా ఉండడమే కాదు, నాడీ వ్యవస్థలో చలనం మొదలై, మొత్తంగా శరీర ఆరోగ్యం చక్కబడే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యేకానీ, కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే, వర్షాకాలాన్ని సంపూర్ణంగా ఆస్వాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top