షుగర్ వ్యాధి హోమియో చికిత్స వల్ల కలిగే లాభాలు

షుగర్‌వ్యాధిని వైద్యపరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. నేటి సమాజంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అధిక శ్రమ వల్ల యుక్తవయసులోనే మనం మధుమేహ వ్యాధిని ఎక్కువగా చూస్తున్నాం. శరీరంలో పాంక్రియాస్ గ్రంధి ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తం ద్వారా చక్కెరను శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తూ సమర్ధవంతమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గడం లేదా అనియంత్రిత వల్ల రక్తంలో చక్కెర పేరుకుపోయి వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తంలో, మూత్రంలో మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు
- ఆకలి ఎక్కువకావడం
- దాహం ఎక్కువగా ఉండటం
- మూత్ర విసర్జన ఎక్కువగా ఉండటం
- బరువు తగ్గడం, నీరసం

కారణాలు
- వంశపారంపర్యం
- మానసిక ఒత్తిడి
- ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం
- అధిక బరువు, వ్యాయామం లేకపోవడం
- స్టెరాయిడ్స్ వాడటం
రకాలు

డయాబెటిస్‌లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్ : క్లోమగ్రంధిలోని ఏలెట్స్ ఆఫ్ లాంగర్‌హాన్స్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు తగ్గిపోవడం లేదా నశించడం వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి పెద్దవారిలోనూ, పిల్లల్లోనూ రావచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని జువెనైల్ డయాబెటిస్ అంటారు. టైప్ 2 డయాబెటిస్ : ఈ రకం ఇన్సులిన్ నిరోధకత వల్ల కలుగుతుంది. కణత్వచంలో ఉండే ఇన్సులిన్ రిసెప్టార్లు వివిధ శరీరభాగాల్లో సరిగ్గా విధిని నిర్వర్తించకపోవడం ముఖ్యకారణం.

జాగ్రత్తలు : ఆహారనియమాలు పాటించాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. క్రమంతప్పకుండా రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. యోగా చేయాలి. మద్యపానం, దూమపానంకు దూరంగా ఉండాలి.

హోమియో చికిత్స విధానం
షుగర్ వ్యాధికి హోమియోలో అద్భుతమైన ఔషధాలున్నాయి. హోమియో వైద్య విధానంలో వ్యాధి లక్షణాలు, వ్యక్తి మానసిక లక్షణాలనుపరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. హోమియోలో వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి మందులు నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీన్ని ఇండివిడ్యువాలిటీ అంటారు. దీనిద్వారా జెనెటిక్ కానిస్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఎంచుకోవడం జరుగుతుంది.

హోమియో చికిత్స వల్ల కలిగే లాభాలు
- షుగర్ అదుపులోకి వస్తుంది.
- షుగర్ వ్యాధి వల్ల కలిగే దుష్ఫలితాలు అరికట్టబడతాయి.
- మానసిక ఆందోళనకు గురైనపుడు శరీర అవయవాలపై ప్రభావం పడకుండా చూస్తుంది.
- డయాబెటిస్‌ను ముందుగా గుర్తించినట్లయితే ఇతర మందుల వాడకం అవసరంలేకుండాచేయవచ్చు.
- హోమియో మందులు వాడటం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు.

హోమియో మందులు
లైకోపోడియం : ఈ మందు డయాబెటిస్‌కు చక్కగా పనిచేస్తుంది. మాససిక ఆందోళతో బాధపడుతున్న వారికి పిరిరితనం, స్వీట్స్ ఇష్టపడటం వంటి లక్షణాలున్న వారికి లైకోపోడియం బాగా పనిచేస్తుంది. శృంగార కోరికలు ఎక్కువగా ఉండటం, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వంటి లక్షణాలున్న వారు వాడదగిన ఔషధం.



ఆర్సనిక్ ఆల్బమ్ : డయాబెటిస్‌కు ముఖ్యమైన ఔషధం. వ్యక్తిత్వం చాలా ఆందోళనకరంగా ఉంటుంది. శుభ్రత ఎక్కువగా పాటిస్తారు. మానసిక ఆందోళన వంటి లక్షణాలున్నప్పుడు ఉపయోగించదగిన మందు.

సల్ఫర్ : చాలా కోపిష్టిగా ఉంటారు. మానసిక ఆందోళన, వ్యాపార సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తీపిపదార్థాలు ఎక్కువగా ఇష్టపడతారు. అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉన్నవారు వాడదగిన హోమియో మందు. పైన చెప్పిన మందులే కాకుండా ఆసిడ్‌ఫాస్, ఇగ్నిషియా, కాల్కేరియా, కాస్టికమ్, నక్స్‌వామికా మందులు కూడా బాగా పనిచేస్తాయి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top