అందమైన మొహంపై మొటిమలు దిష్టిచుక్కల్లా కనిపిస్తుంటాయి. అవి రాకుండా, వచ్చినా పోయేలా చేయడానికి బోలెడు చిట్కాలు పాటిస్తుంటారు. మొటిమలను మాయం చేయడంలో అన్నిటికంటే వేగంగా పనిచేస్తుంది వేప.
- లేత వేప ఆకులు, పుదీన ఆకులు మెత్తగా నూరి అందులో కొద్దిగా పచ్చి పాలు కలిపి రోజూ ఉదయం స్నానం చేసే ముందు మొహానికి పట్టించి పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. వానాకాలంలో స్నానం చేసే నీళ్లలో వేపాకులు వేసుకుంటే ఎలర్జీలు రాకుండా ఉంటాయి.
- పుల్లటి పెరుగులో కొద్దిగా పసుపు, రెండు వేపనూనె చుక్కలు వేసి బాగా కలిపి మొహానికి పట్టించాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.